ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే కారెక్కుతారా ? కేసిఆర్ ఇచ్చిన హామీ ఏంటి ?

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ మంచి దూకుడు మీద ఉంది.టిఆర్ఎస్ ను ప్రధాన టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తోంది.

 Will That Congress Mla Run What Is The Guarantee Given By Kcr-TeluguStop.com

తెలంగాణలో బిజెపి ప్రభావం ఉన్నా, ఆ పార్టీని మరిపించే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అయ్యింది.వరుసగా భారీ బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ టిఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

త్వరలో హుజురాబాద్ ఉప ఎన్నికలు జరగబోతుండడం తో టిఆర్ఎస్ లో ఆందోళన మొదలైంది.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభావం తీవ్రంగా ఉండడంతో,  కాంగ్రెస్ ను బలహీనం చేసే విషయంపై టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి సారించారు.

 Will That Congress Mla Run What Is The Guarantee Given By Kcr-ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే కారెక్కుతారా కేసిఆర్ ఇచ్చిన హామీ ఏంటి -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనిలో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీసేందుకు సిద్ధమవుతున్నారు.

        ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్, శాసన సభా పక్ష నేత భట్టి విక్రమార్క ను టీఆర్ఎస్ లో చేర్చుకునే విషయం పై కెసిఆర్ సీరియస్ గా దృష్టి సారించారు.

ఆయనను చేర్చుకోవడం ద్వారా,  కాంగ్రెస్ ను దెబ్బ తీయడమే కాకుండా , ఎస్సీ సామాజికవర్గం లోను పట్టు సంపాదించుకునేందుకు ఉపయోగపడుతుందనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారట.వాస్తవంగా ఆయన హుజురాబాద్ ఎన్నికల ప్రస్తావన లేని సమయంలోనే టిఆర్ఎస్ లో చేరాల్సి.

  ఉన్నా, అనేక కారణాలతో వాయిదా వేసుకున్నారని, ఇప్పుడు ఆయనను చేర్చుకునేందుకు సరైన సమయంగా కెసిఆర్ భావిస్తుండటం తోనే, ఆయన చేర్చుకునే విషయంపై దృష్టి సారించారట.
   

Telugu Bjp, Revanth Reddy, Telangana Congress, Telangana Congress President, Tpcc, Trs-Telugu Political News

     ఇక ఆయన టీఆర్ఎస్ వైపు కు వెళ్లిపోతున్నారనే వాదనకు బలం చేకూర్చేలా ఇటీవల చోటు చేసుకున్న అనేక పరిణామాలు ఉన్నాయి.తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దళిత బంధు పథకం పై అనేక విమర్శలు చేసిన సమయంలోనే దళిత బంధు సన్నాహక ప్రచార కార్యక్రమాల్లో బట్టి విక్రమార్క తన నియోజకవర్గ పరిధిలో పాల్గొన్నారు.అలాగే ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్న మండవ సీతంపేట నాగులవంచ ఒంటి గ్రామాల్లోని దళిత కాలనీల ను సందర్శించిన బట్టి విక్రమార్క ఈ సందర్భంగా దళిత బంద్ పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతుందని హామీ ఇచ్చారు.

అక్కడితో ఆగకుండా ఈ పథకం ద్వారా, దళితుల జీవితాల్లో వెలుగులు వస్తాయని మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది ఒకపక్క రేవంత్ ఈ పథకం పై విమర్శలు చేస్తుండగా బట్టి విక్రమార్క పొగడ్తల వర్షం కురిపించడం అందరిని అయోమయానికి గురి చేసింది.అయితే ఆయన టీఆర్ఎస్ లో చేరే  ఉద్దేశం తోనే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు మొదలయ్యాయి.

భట్టి విక్రమార్క కనుక టి.ఆర్.ఎస్.లో చేరితే ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి వెళ్లిన ఎమ్మెల్యే సంఖ్య 13 కు చేరుతుందిkcr.అలాగే బట్టి విక్రమార్క కు కెసిఆర్ ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశారనే ప్రచారం జోరందుకుంది.

 

#TPCC #Revanth Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు