సాగర్ సంగమంలో జానారెడ్డి సత్తా చాటేనా... నేడే చివరి తేదీ

తెలంగాణలో ఒకప్పుడు ఒక్క వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో అత్యంత బలహీనమైన పార్టీగా మారింది.రోజురోజుకు కాంగ్రెస్ మరింత బలహీనంగా మారుతోంది.

 Will Telangana Congress Leader Janareddy Give Tough Fightnagarjuna Sagar By Elections-TeluguStop.com

దానికి నిదర్శనమే వరుస ఎన్నికల్లో సత్తా చాటుకోలేక పోవడమే.దుబ్బాక ఉప ఎన్నిక నుండి మొదలు గ్రేటర్ ఉప ఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా జరిగిన అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ ఘోరంగా చతికిల పడి పోయిన విషయం తెలిసిందే.

అయితే కాంగ్రెస్ కు తన పూర్వ ప్రతిష్టను నిలుపుకోవడానికి నాగార్జునసాగర్ ఉప ఎన్నిక రూపంలో ఒక అవకాశం లభించింది.నాగార్జునసాగర్ కాంగ్రెస్ కు కంచుకోటగా భావిస్తున్న తరుణంలో ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.

 Will Telangana Congress Leader Janareddy Give Tough Fightnagarjuna Sagar By Elections-సాగర్ సంగమంలో జానారెడ్డి సత్తా చాటేనా… నేడే చివరి తేదీ-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జానారెడ్డి ఈ నియోజకవర్గం నుండే ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.అయితే కేసీఆర్ గాలిలో ప్రత్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో 2వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది.

అయితే ఇప్పుడు జానారెడ్డికి తన పట్టు నిలుపుకునే అవకాశం వచ్చింది.ఇప్పటికే కాంగ్రెస్ టీఆర్ఎస్ కు ధీటుగా ప్రచారం చేస్తూ గట్టిపోటీ ఇస్తోంది.

నేడే ప్రచారానికి చివరి తేదీ కావడంతో జానా గెలుపుపై ఉత్కంఠ నెలకొందనే చెప్పవచ్చు.మరి జానా విజయం సాధిస్తాడా లేదా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

#NagarjunaSagar #Congress Party #JanareddyTough

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు