గత కొన్నాళ్లుగా అధికార వైసీపీకి సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వంటి వాళ్ళు క్రాస్ ఓటింగ్ కు పాల్పడి వైసీపీని గట్టిగానే దెబ్బ తీశారు.
తరువాత వీరిని వైసీపీ నుంచి బహిహిష్కరించారనుకోండి అది వేరే విషయం.అయితే ఆ తరువాత నుంచి ఈ నలుగురు ఏ పార్టీలో చేరతారు ? వీరి అడుగులు ఎటువైపు పడనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.కాగా వీరు టీడీపీలో చేరతారనేది ఓపెన్ సీక్రెట్ అయినప్పటికి ఇంతవరుకు అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు.అయితే ఇటీవల ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం తాను టీడీపీలో చేరబోతున్నాట్లు స్పష్టం చేశారు.

ఇక త్వరలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( Kotamreddy Sridhar Reddy )కూడా త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు ఆ మద్యనే పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది.ఈ ముగ్గురు బలమైన నేతలు కావడంతో నెల్లూరు రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను వైసీపీ హస్తగతం చేసుకుంది.
జిల్లాలో ఆ 2స్థాయి విజయం దక్కడంలో వీరి పాత్ర కూడా చాలానే ఉంది.కానీ ఈసారి వీరంతా వైసీపీ( YCP ) నుంచి బయటకు రావడంతో ఆ పార్టీకి జిల్లాలొ తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
ఇక ఈ ముగ్గురి రాకతో నెల్లూరులో టీడీపీ మరింత బలం పెంచుకునే అవకాశం కనిపిస్తోంది.

కాగా ఈ ముగ్గురు టీడీపీలో చేరితే చంద్రబాబు( Chandrababu Naidu ) వీరు కోరిన సీట్లను కేటాయించేందుకు చంద్రబాబు సిద్దంగా ఉన్నారా ? లేదా అనేది ప్రశ్నార్థకమే.కానీ ప్రస్తుతం పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు జిల్లాలో ఆయా నియోజిక వర్గాలలో వీరినే బరిలోకి దించితే వైసీపీ బహిష్కృత అభ్యర్థులుగా టీడీపీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందా ? లేదా ఆ అపనిందనే టీడీపీకి ప్లేస్ అవుతుందా అనేది కూడా కొంత ఆసక్తికరమే.అయితే ఎన్నికల ముందు నెల్లూరు కేంద్రంగా ఈ ముగ్గురు నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేసిన.
జిల్లా ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.మరి ఈ ముగ్గురి రాకతో టీడీపీ నెల్లూరులో క్లీన్ స్వీప్ చేస్తుందో లేదో చూడాలి.
