ఇక మోడీ సపోర్ట్ తో తమిళిసై స్పీడ్ పెంచనున్నారా?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు కీలక మలుపులతో ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి ఉంది.అయితే తెలంగాణలో గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ కు ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.

 Will Tamilsai Speed Up With Modi Support Details, Trs Party, Telangana Politics,-TeluguStop.com

అయితే తాజాగా ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి మోడీ ని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కూలంకుశంగా వివరించిన పరిస్థితి ఉంది.అయితే ఇక గవర్నర్ గా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని స్వేచ్చగా నిర్ణయాలను తీసుకోవాలని మోడీ సూచించినట్లు తెలుస్తోంది.

దీంతో ఇక మోడీ సపోర్ట్ తో గవర్నర్ మరింత స్పీడ్ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీంతో ఇక మరి కొన్ని కీలక నిర్ణయాలు రానున్న రోజుల్లో తీసుకునే అవకాశం కనిపించడంతో పాటు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను కూడా రానున్న రోజుల్లో ప్రశ్నించి మరింత రాజకీయ వేడి రాజుకునే అవకాశం కనిపిస్తోంది.

అయితే గవర్నర్ ఢిల్లీ పర్యటనపై టీఆర్ఎస్ పార్టీ నుండి ఎటువంటి స్పందన రాకపోయినా రానున్న రోజుల్లో స్పందించే అవకాశం కనిపిస్తోంది.అయితే కెసీఆర్ గవర్నర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని స్వాగతిస్తారా లేదా అనేది కెసీఆర్ స్పందిస్తే కానీ మనం ఊహించి వ్యాఖ్యానించగలగలేనటువంటి పరిస్థితి ఉంది.

Telugu @cm_kcr, @trspartyonline, Amit Sha, Cm Kcr, Soundarya Rajan, Tamilisi Del

ప్రస్తుతం టీఆర్ఎస్ అనుసరిస్తున్న వైఖరిని బట్టి చూస్తే ఇంకా రానున్న రోజుల్లో గ్యాప్ పెరిగే అవకాశం కనిపిస్తోంది.అయితే ఎంత మేరకు తనకు ఉన్న విశేష అధికారాలను ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కొరకు వినియోగిస్తుంది, ఏయే విషయాలను ప్రశ్నించే అవకాశం ఉందనేది తెలియాల్సి  ఉంది.తాజాగా తమిళి సై వ్యాఖ్యలను బట్టి చూస్తే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆగ్రహంగానే ఉన్నట్టు తెలుస్తోంది.మరి మోడీ సపోర్ట్ తో తమిళి సై ఎలా వ్యవహరిస్తారనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube