‘‘ బిట్‌కాయిన్‌ ’’ రూపంలోనే పే చెక్స్ తీసుకుంటా: ఉద్దేశ్యం చెప్పేసిన న్యూయార్క్ కొత్త మేయర్

బిట్ కాయిన్‌.ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తున్న మాట.

 will Take First Three Paychecks In Bitcoin New York Mayor-elect , Bitcoin, Digit-TeluguStop.com

అంతేకాదు, ఈ బిట్ కాయిన్ విలువ అమాంతం పైకి పెరుగుతోందనే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి.ఈ క్ర‌మంలో బిట్ కాయిన్స్‌ గురించి తెలియ‌క‌పోయినా చాలామంది వాటితో క‌రెన్సీ ట్రేడింగ్ చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు.

బిట్ కాయిన్‘ అనేది నిజానికి ఏ దేశానికి చెందిన క‌రెన్సీ కాదు.దీన్ని ఏ దేశం కూడా త‌యారు చేయ‌లేదు.ఇదొక వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ.దీన్నే డిజిట‌ల్ క‌రెన్సీ, క్రిప్టో కరెన్సీ అని కూడా పిలుస్తారు.

అంటే.కేవ‌లం ఇంట‌ర్నెట్‌లోనే ఈ క‌రెన్సీ చెల్లుబాటు అవుతుంద‌న్న‌మాట‌.

అయితే దీని విలువ నానాటికీ పెరిగిపోతుండటంతో ఆయా దేశాలు క్రిప్టోకరెన్సీపై ఫోకస్ పెట్టాయి.దీనిని మారకంగా అనుమతిస్తున్నాయి కూడా.

ఈ నేపథ్యంలో న్యూయార్క్ కొత్త మేయర్ ఎరిక్ ఆడమ్స్ కీలక ప్రకటన చేశారు.తన మొదటి పే చెక్స్‌ను బిట్‌కాయిన్ రూపంలోనే తీసుకుంటానని వెల్లడించారు.అంతేకాదు జనవరిలో మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత న్యూయార్క్‌ను ‘‘క్రిప్టో కరెన్సీకి కేంద్రంగా’’ మార్చనున్నట్లు చెప్పారు.ఈ మేరకు ఆడమ్స్ ట్వీట్ చేశారు.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్‌లోనే తన మొదటి జీతం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు.మియామీ మేయర్ ఫ్రాన్సిస్ సురెజ్‌ ట్వీట్‌కు రిప్లయ్ ఇస్తూ ఆడమ్స్ పై విధంగా రాసుకొచ్చారు.

మంగళవారం జరిగిన సిటీ కౌన్సిల్ ఎన్నికల్లో సువారెజ్ మరోసారి మేయర్‌గా ఎన్నికయ్యారు.మియామీని క్రిప్టోకరెన్సీ ఆవిష్కరణలకు కేంద్రంగా నిర్మించేందుకు ఇప్పటికే సువారెజ్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Telugu Adamsbrooklyn, Bitcoin, Cryptocurrency, Currency, Yorkmayor-Telugu NRI

కాగా.న్యూయార్క్ నగరానికి తదుపరి మేయర్‌గా మాజీ పోలీస్ అధికారి, డెమొక్రాటిక్ నేత ఎరిక్ ఆడమ్స్ ఎన్నికైన సంగతి తెలిసిందే.తద్వారా అమెరికాలోని అతిపెద్ద నగరానికి సారథ్యం వహించనున్న రెండో ఆఫ్రికన్ అమెరికన్‌గా ఆడమ్స్ రికార్డుల్లోకెక్కారు.2014 నుంచి ఆడమ్స్ బ్రూక్లిన్ బరో అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.మేయర్ ఎన్నికలలో గార్డియన్ ఏంజెల్స్ సివిలియన్ పెట్రోలింగ్ వ్యవస్థాపకుడు, రిపబ్లికన్ కర్టిస్ స్లివాను ఆయన ఓడించాడు.ప్రజా భద్రత, శ్రామిక తరగతి నివాసితులకు గొంతుగా మారతానని ఆయన ఎన్నికల ప్రచారంలో వాగ్థానం చేశారు.61 ఏళ్ల ఆడమ్స్ జనవరిలో డెమొక్రాట్ బిల్ డి బ్లాసియో నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.బ్లాసియో దాదాపు ఎనిమిదేళ్ల పాటు న్యూయార్క్ మేయర్‌గా విధులు నిర్వర్తించారు.

అయితే మేయర్‌గా ఆడమ్స్‌కు సవాళ్లు స్వాగతం పలకనున్నాయి.కరోనా వైరస్‌ తర్వాత నగరంలోని ఆర్ధిక వ్యవస్థ, కార్యకలాపాలను తిరిగి గాడిలో పెట్టాల్సి వుంది.

న్యూయార్క్‌లో ఎరిక్ ఆడమ్స్ అత్యంత సులభంగా గెలుస్తాడని అంతా ముందే ఊహించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube