బాలయ్య బాబు హిట్ సాంగ్ ని రీమేక్ చేస్తున్న క్రేజీ సంగీత దర్శకుడు...  

Will Swathilo Muthyamantha Remake In Balayya Upcoming Movie - Telugu Boyapati Srinu, Swathilo Muthyamantha , Swathilo Muthyamantha Balakrishna, Swathilo Muthyamantha News, Swathilo Muthyamantha Remake News

ప్రస్తుతం టాలీవుడ్ లో నందమూరి నటసింహం బాలయ్య బాబు సింహ, లెజెండ్ వంటి చిత్రాలతో బాలయ్య బాబు కి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్లను అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో హీరోయిన్లుగా నయనతార, అంజలి నటిస్తున్నారు.

Will Swathilo Muthyamantha Song Remake In Balayya Upcoming Movie

అయితే ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయి తొందరలోనే వారణాశిలో షూటింగ్ జరుపుకోనుంది.అయితే ఈ చిత్రానికి టాలీవుడ్ క్రేజీ సంగీత దర్శకుడు ఎస్.ఎస్ థమన్ స్వరాలను సమకూరుస్తున్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం అప్పట్లో బాలయ్య బాబు నటించిన టువంటి బంగారు బుల్లోడు చిత్రంలోని “స్వాతిలో ముత్యమంత” అనే పాట ఎంత మంచి హిట్ అయిందో అందరికీ బాగా తెలుసు.

అయితే ఈ పాటని మళ్లీ ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో వస్తున్నచిత్రం కోసం రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది.అంతేగాక ఈ విషయమై ఇప్పటికే దర్శకుడు బోయపాటి శ్రీను ఎస్.ఎస్ థమన్ ని సంప్రదించడం వల్ల ప్రస్తుతం  థమన్ ఈ పాటను రీమేక్ చేసే పనిలో బిజీ బిజీ అయ్యాడు.అయితే అప్పట్లో ఈ పాటని ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మరియు కె.ఎస్.చిత్ర కలిసి పాడారు.ఈ పాట ఇప్పటికీ చాలామందికి తమ ఇష్టమైన పాటల జాబితాలో ఉంటుంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ కొన్ని సన్నివేశాల్లో అఘోర పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.అందువల్లనే ఈ చిత్రం నీకు సంబంధించినటువంటి మొదటి షూటింగ్ షెడ్యూల్ ని వారణాసిలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ మధ్య కాలంలో బాలయ్య బాబు నటించినటువంటి రూలర్ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test