ఆమెతో హ్యాట్రిక్‌ కొట్టేనా?

‘రొటీన్‌ లవ్‌ స్టోరీ’, ‘రారా కృష్ణయ్య’ చిత్రాల్లో రెజీనాతో రొమాన్స్‌ చేసిన సందీప్‌ కిషన్‌ తాజాగా మరో చిత్రాన్ని కూడా పూర్తి చేశాడు.మొదటి రెండు తెలుగులో తెరకెక్కగా మూడవ చిత్రం మాత్రం వీరిద్దరి కాంబినేషన్‌లోనే తమిళంలో తెరకెక్కింది.

 Will Sundeep Kishan Gets Hat Trick With Regina..?-TeluguStop.com

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అవుతున్న ఆ సినిమాను తెలుగులో కూడా డబ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కామెడీ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాతో సందీప్‌ కిషన్‌ ముచ్చటగా మూడవ సారి రెజీనాతో రొమాన్స్‌ చేయడం జరిగింది.

సైలెంట్‌గా ఈ సినిమాను పూర్తి చేసిన సందీప్‌ కిషన్‌ తమిళంలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.అతి త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

‘టైగర్‌’ చిత్రంతో నిరాశ పర్చిన సందీప్‌ ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాను అనే నమ్మకంతో ఉన్నాడు.దానికి తోడు తనకు డబుల్‌ సక్సెస్‌ను ఇచ్చిన రెజీనాతో ఈ సినిమాలో రొమాన్స్‌ చేయడం కూడా కలిసి వస్తుందనే నమ్మకంతో ఈయన ఉన్నాడు.

మరి సందీప్‌ కిషన్‌కు రెజీనా హ్యాట్రిక్‌ ఇచ్చేనా చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube