బిబి 4: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా.. అవినాష్ కు గండం తప్పినట్లేనా..!

ఇంకో మూడు వారాల్లో బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ముగింపు పలకనుంది.ఇందుకు సంబంధించి డిసెంబర్ 20వ తేదీన ఫైనల్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

 Bigboss4, Harika, Anijith, Avinash, Monal, Jabardast Avinash, Top 5 Contestants,-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రతి వారం బిగ్ బాస్ ఇంట్లో నుంచి ఒక్కో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్న నేపథ్యంలో తాజాగా పోయిన వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా జబర్దస్త్ అవినాష్ తృటిలో తప్పించుకున్నట్లు అయ్యింది.చివరిసారి తప్పించుకున్న అవినాష్ ఈసారి కచ్చితంగా ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో తాజాగా ఎలిమినేషన్ కు సంబంధించి ఓ అప్డేట్ తెగ చక్కర్లు కొడుతోంది.

ఇందుకు సంబంధించి అసలు విషయంలోకి వెళితే.

బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్ తమ మన అన్న భేదం లేకుండా ఎవరి ఆటను వారు ఆడుతూ టాప్ 5 కంటెస్టెంట్స్ లో నిలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

షో చివరి దశకు చేరుకోవడంతో బిగ్ బాస్ టాస్క్ కంప్లీట్ చేసేందుకు కంటెస్టెంట్ లు తెగ ప్రయాసపడి పోతున్నారు.ఇదివరకు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుంటూ ముందుకు సాగిన ఈ షో ప్రస్తుతం తమ కోసమే అన్నట్లుగా గేమ్ ఆడుతూ ముందుకు సాగుతున్నారు.

దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ షో చాలా ఆసక్తిగా మారింది.షో ముగిసే టైం దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్ లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న చర్చ అప్పుడే మొదలైంది.

అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో అసహనానికి గురైన అవినాష్ ఎలిమినేట్ చేయాల్సిందిగా అతను బాహాటంగానే చెప్పుకొచ్చాడు.అయితే బిగ్ బాస్ మైండ్ లో ఎవరున్నారన్న విషయంపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు.

Telugu Anijith, Avinash, Bigboss, Harika, Monal-Latest News - Telugu

ఈ వారం సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియలో మొత్తం 5 మంది కంటెస్టెంట్ లు ఉండగా అందులో ఎవరు బయటికి వస్తారన్న విషయంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.ఈ వారం హారిక, అఖిల్, అవినాష్, అభిజిత్, మోనాల్ లు నామినేషన్స్ లో ఉన్నారు.తాజాగా ఇప్పటివరకు పోలైన ఓట్లు పరిశీలిస్తే నామినేషన్స్ లో ఐదుగురు లో హారికకు తక్కువ ఓట్లు పడ్డాయని తెలుస్తోంది.దీంతో హారిక ఈవారం ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుందని సోషల్ మీడియాలో తెగ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఒకవేళ ఇదే జరిగితే హారిక ఫ్యాన్స్ కచ్చితంగా డిసప్పాయింట్ అవ్వడం ఖాయం.దీనికి కారణం హారిక కూడా టైటిల్ పోరులో ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్.ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో ఒకరిని ఉంచడానికి మరొకరిని బలి చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో బిగ్ బాస్ పై అనేక ట్రోలింగ్స్ మొదలయ్యాయి కూడా.చూడాలి మరి ఈసారి ఈ ఐదుగురిలో ఎవరు బయటికి వెళ్తారో.? ఎవరు ఫైనల్ కు చేరుతారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube