శర్వానంద్ ఈ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వస్తాడా..?

తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు ఆకట్టుకునే అందం కూడా ఉన్న నటుల్లో శర్వానంద్ ఒకరు.ఈయన కెరీర్ మొదటి నుండి తనకు తగిన పాత్రలను ఎంచుకుంటూ డీసెంట్ హిట్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Will Sharwanand Get Hit Track On Mahasamudram Movie-TeluguStop.com

ఎప్పుడూ కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు.అయితే కొద్దీ రోజులుగా ఈయన సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.

ఆయన నటించిన మహానుభావుడు సినిమా హిట్ తర్వాత రెండు సినిమాలు చేసిన హిట్ అందుకోలేక పోయాడు.శర్వానంద్ 96 రీమేక్ గా జాను సినిమా చేసాడు.అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేక పోయింది.తర్వాత ఈ మధ్యనే ఆయన చేసిన శ్రీకారం సినిమా విడుదల అయ్యింది.

 Will Sharwanand Get Hit Track On Mahasamudram Movie-శర్వానంద్ ఈ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వస్తాడా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అయితే అందుకుంది కానీ కమర్షియల్ హిట్ సాధించలేకపోయింది.

ప్రస్తుతం శర్వానంద్ ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘మహాసముద్రం‘ లో నటిస్తున్నాడు.

Telugu Aditi Rao Hydari, Ajay Bhupathi, Anu Emmanuel, Chaitanya Bharadwaj, Hero Siddharth, Jaanu, Mahasamudram, Sharwanand, Sharwanand Career, Srikaaram, Will Sharwanand Get Hit Track On Mahasamudram Movie-Movie

ఈ సినిమా కూడా హిట్ అవ్వకపోతే శర్వానంద్ కెరీర్ లో చాలా వెనుక బడి పోతాడు.అందుకే ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.ఈ సినిమాను లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.

మహా సముద్రం సినిమాలో హీరో సిద్దార్ధ్ కూడా నటిస్తున్నాడు.చాలా రోజుల తర్వాత సిద్దార్థ్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.

అతిధి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను ఏకె ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.

చైతన్య భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.చూడాలి మరి శర్వానంద్ ఆశ ఈ సినిమా ద్వారా అయినా తీరుతుందో లేదో.

#Mahasamudram #Sharwanand #Srikaaram #WillSharwanand #Hero Siddharth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు