తెలుగులో కూడా 'పఠాన్'కు భారీ ఓపెనింగ్స్ రానున్నాయా?

బాలీవుడ్ స్టార్ హీరోల్లో షారుఖ్ ఖాన్ ఒకరు.ఈయన ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో బాలీవుడ్ లోనే తిరుగులేని స్టార్ హీరోగా ఎదిగాడు.

 Will Shah Rukh Khan Pathaan Get Solid Openings Details, Pathaan Movie, Shah Rukh-TeluguStop.com

అయితే ఈయన మంచి హిట్ అందుకుని దశాబ్దం అవుతుంది.జీరో సినిమాతో అట్టర్ ప్లాప్ అందుకుని ఇప్పుడు భారీ గ్యాప్ తీసుకుని మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ప్రెజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్క హిట్ అంటూ ఎదురు చూస్తున్నారు.చాలా కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న విషయం విదితమే.ఒకవైపు మన సౌత్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటుంటే బాలీవుడ్ మాత్రం హిట్స్ లేక బాధపడుతుంది.అయితే షారుఖ్ అయినా బాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ హిట్స్ అందిస్తాడేమో అని అంతా ఎదురు చూస్తున్నారు.

Telugu Bollywood, Siddharth Anand, Pathaan, Pathaan Telugu, Shah Rukh Khan, Shar

ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.బాలీవుడ్ యాక్షన్ సినిమాల డైరెక్టర్ ఆనంద్ సిద్ధార్థ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కు జోడీగా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా హిందీతో పాటు తమిళ్, తెలుగులో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది.

Telugu Bollywood, Siddharth Anand, Pathaan, Pathaan Telugu, Shah Rukh Khan, Shar

మరి ఈ మేరకు ఇప్పటికే ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు.ట్రేడ్ పండితులు చెబుతున్న దాని ప్రకారం హిందీతో పాటు ఈ సినిమా తెలుగులో కూడా సాలిడ్ ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉంది అని అంటున్నారు.తెలుగు ఆడియెన్స్ కూడా ఈ సినిమాపై కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

షారుఖ్ ఖాన్ చేస్తున్న ప్రమోషన్స్ కారణంగా ఈ సినిమాకు తెలుగులో మంచి వెల్కమ్ దక్కుతుంది అంటున్నారు.చూడాలి బాలీవుడ్ సినిమా తెలుగులో ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube