అల్లరి నరేష్ తాజాగా నటించిన చిత్రం ‘బందిపోటు’.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్దం అవుతోంది.
వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తోన్న అల్లరోడు ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు.ఇక చాలా సంవత్సరాల తర్వాత ఈవీవీ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది.
అల్లరి నరేష్ మరియు ఆర్యన్ రాజేష్‌లు కలిసి ఈ సినిమాను నిర్మించారు.మోహన కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
ఈ సినిమాలో స్పెషల్ అపియరెన్స్గా బర్నింగ్‌స్టార్ సంపూర్నేష్‌బాబు నటించాడు.
కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ మరో కామెడీ హీరో అయిన సంపూర్నేష్బాబును ‘బందిపోటు’ సినిమాలో తెగ వాడేసుకున్నట్లుగా తెలుస్తోంది.
వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని అంటున్నారు.సక్సెస్ కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న అల్లరోడు ఈ సినిమాతో సక్సెస్ కొట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
వచ్చే నెల మొదటి వారం లేదా ఈ నెల చివరి వారంలో ‘బందిపోటు’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.మరి ఈ సినిమా అల్లరి నరేష్‌కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.