సినిమా ఇండస్ట్రీకి.క్రికెట్ రంగానికి ఎంతో అవినాభావ సంబంధం ఉందని గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుస్తుంది.
ఇప్పటికే ఎంతో మంది స్టార్ క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్స్ తో ప్రేమ ప్రయాణాలు చేసి పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో హ్యాపీగా కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే మరికొందరు క్రికెట్ వారసులు కూడా వెండితెరపై తమ సత్తా చాటుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తుంటారు.
ఆ విధంగా స్పోర్ట్స్ రంగం నుంచి సినిమా రంగంలోకి వచ్చి అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న వారు కూడా ఉన్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ తండ్రి ఒకప్పుడు భారత క్రికెట్ టీం కెప్టెన్.
కానీ తన పిల్లలు తన భార్య షర్మిల ఠాగూర్ బాటలో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు.ఇలా ఎంతోమంది స్పోర్ట్స్ రంగం నుంచి సినిమా రంగంలోకి వచ్చి తమదైన ముద్ర వేసుకుంటున్నారు.
తాజాగా క్రీడారంగం నుంచి మరో వారసురాలు వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైందా.అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.ఇంతకీ ఆ వారసురాలు మరెవరో కాదు ఇండియా మొత్తం గాడ్ ఆఫ్ క్రికెటర్ గా భావించే సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్.సోషల్ మీడియాలో మిలియన్ కొద్ది ఫాలోవర్స్ తో దూసుకుపోతున్న సారా టెండూల్కర్ కెమెరా ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని బీటౌన్ సమాచారం.

ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈమె షేర్ చేసే ఫోటోలు చూస్తే మాత్రం ఈమె తప్పనిసరిగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.సచిన్ టెండూల్కర్ లాంటి తండ్రి వెనుక ఉండటమే కాకుండా,తన టాలెంట్, గ్లామర్ తో సారా టెండూల్కర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు.అయితే సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే ఫోటోలు చూస్తే మాత్రం త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని బాలీవుడ్ సమాచారం.మరి ఈ బ్యూటీ వెండితెరపై సందడి చేస్తుందా? లేదా? అనే ఈ విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.