‘బాహుబలి’ రికార్డులను బద్దలు కొట్టుట చిట్టికి సాధ్యం కాదట, ఎందుకంటే..!  

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం బాలీవుడ్‌ సినిమాలకు సైతం అందనంత భారీ రికార్డులను నమోదు చేసింది. ఇక సౌత్‌ సినిమాలకు ఆ రికార్డులు చుక్కలే అంటూ ఇన్నాళ్లు తెలుగు ప్రేక్షకులు భావించారు. అయితే శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘2.ఓ’ చిత్రం అద్బుతమైన విజువల్‌ వండర్‌ అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బాహుబలి రికార్డులు సునాయాసంగా బ్రేక్‌ అవుతాయని తమిళ ఆడియన్స్‌ నమ్మకంగా ఉన్నారు. ఎట్టి బాహుబలి రికార్డులన్నీ కూడా కనిపించకుండా, పోతాయని, అన్ని చోట్ల అన్ని రకాల రికార్డులు కూడా బ్రేక్‌ అవ్వడం ఖాయమంటూ వారు ధీమాగా ఉన్నారు.

Will Robot 2 Break The Record Of Baahubali 2-Director Shankar Rajinikanth Movie

Will Robot 2 Break The Record Of Baahubali 2

‘బాహుబలి’ అన్ని రికార్డులను ‘2.ఓ’ చిత్రం బ్రేక్‌ చేయడం అంత సులభం కాకపోవచ్చు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి చిత్రం పామరుల నుండి పండితుల వరకు అంటే క్లాస్‌, మాస్‌, ఏ, బి, సి అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. బాహుబలి కథ కూడా అద్బుతమైన పాయింట్‌తో సాగింది. ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అంటూ దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. అందుకే బాహుబలి 2 చిత్రం ఆ స్థాయి రికార్డులను సొంతం చేసుకుంది.

Will Robot 2 Break The Record Of Baahubali 2-Director Shankar Rajinikanth Movie

ఇక 2.ఓ చిత్రం విషయానికి వస్తే ఆ స్థాయి క్రేజ్‌ లేదని చెప్పాలి. క్లాస్‌ ఆడియన్స్‌ మాత్రమే ఈ చిత్రంపై ఆసక్తి చూపుతున్నారు. కొందరు సి క్లాస్‌ ప్రేక్షకులు ఇది ఒక రోబో చిత్రం అని, పూర్తి ఇంగ్లీష్‌ సినిమాలా ఉంటుంది, మనకేం పడుతుందే అనుకుంటున్నారు. అలా ఈ చిత్రం కలెక్షన్స్‌ ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఇండియాలో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉన్న బాహుబలి 2 రికార్డును 2.ఓ బ్రేక్‌ చేయలేక పోవచ్చు. అయితే ఓవరాల్‌గా కలెక్షన్స్‌ మాత్రం బాహుబలి కంటే ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రపంచ దేశాల్లో 2.ఓ కు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది. అందుకే మన బాహుబలికి చిట్టి రోబో వ్ల ఎలాంటి ఢోకా లేదు.