రేవంత్ ఒంటరి పోరాటం కాంగ్రెస్ కు లాభించేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండనేది మనం ప్రత్యేకంగా చర్చించుకోనక్కరలేదు.అయితే ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

 Will Revanth Alone Struggle Benefit Congress, Congress Party, Rewanth Reddy, Con-TeluguStop.com

అయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అసలు ప్రజల్లో లేని నాయకులు.వారు కనీసం వాళ్లు గెలిస్తే పట్టభద్రుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో కూడా క్లారిటీ ఇవ్వకపోతే వీరిని పట్టభద్రులు పరిగణలోకి తీసుకుంటారా లేదా అనే సామజిక విశ్లేషణ చేసుకోకుంటే ఎన్నికల్లో ఎలా నెగ్గుతారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.

అయితే రేవంత్ తనకున్న శక్తి మేరకు ఒంటరి పోరాటం చేసిన పరిస్థితుల్లో రేవంత్ చరిష్మా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడంలో కీలకపాత్ర పోషిస్తే రేవంత్ స్థాయి మరింత పెరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.ఏది ఏమైనా కాంగ్రెస్ సత్తా ఏమిటని తెలియాలంటే పట్టభద్రులు ఇచ్చే తీర్పును బట్టి తెలిసే అవకాశం ఉంది.

ఎమ్మెల్సీ ఎన్నికల చివరి సమయంలో కాంగ్రెస్ నాయకులు సభ నిర్వహించి కాంగ్రెస్ పట్టభద్రుల అభ్యర్థులు తమకు అవకాశం ఇవ్వాలని పట్టభద్రుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.అయితే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్ అభ్యర్థులు, మిగతా అభ్యర్థులతో పోలిస్తే కొంత వెనకబడి ఉన్నారని వినికిడి.

ఏది ఏమైనా ఉత్కంఠకు గురి చేస్తున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులు ఎవరికి మద్దతిస్తారనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube