రేవంత్ ఉంటారా వెళ్తారా ? తేల్చబోతున్న ఆ పదవి ?  

రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఏ మలుపులు జరగబోతుంది అనేది ఆయన కంటే , మిగతా రాజకీయ పార్టీల నాయకులకు ఎక్కువగా ఆసక్తి గా ఉన్నట్టు కనిపిస్తోంది.ప్రస్తుతం ఆయన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లో కొనసాగుతున్నారు.

TeluguStop.com - Will Rewanth Be In Congress Or Not That Position Is Going To Be Decided

కాంగ్రెస్ ను అధికారం వైపు నడిపించేందుకు, తన శక్తివంచన లేకుండా పోరాడుతున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలపై నిలదీస్తూ, కాంగ్రెస్ కు మళ్ళీ పునర్వైభవం తీసుకు వచ్చేందుకు తన శక్తికి మించి రేవంత్ కష్టపడుతున్నారు.

అయితే ఆయనకు పార్టీ సీనియర్ నాయకుల సహకారం ఈ విషయంలో  లేదనే చెప్పుకోవాలి.కేవలం రేవంత్ తన ఇమేజ్ ను  పెంచుకునేందుకు కాంగ్రెస్ లో చేరారనీ, పూర్తిగా ఆయనకు కలిసివచ్చే విధంగానే రాజకీయం చేస్తున్నారని,  కాంగ్రెస్ సీనియర్ల అభిప్రాయం.

TeluguStop.com - రేవంత్ ఉంటారా వెళ్తారా తేల్చబోతున్న ఆ పదవి -General-Telugu-Telugu Tollywood Photo Image

అందుకే ఆయన హవా ను అడ్డుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నట్టు గా వ్యవహరిస్తున్నారు.

అయితే గతంతో పోలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ కు కాస్త ఊపు వచ్చిందని, ఇదంతా రేవంత్ దూకుడు కారణంగానే అనే అభిప్రాయం కాంగ్రెస్ పెద్దల్లో ఉంది.

అందుకే ఆయనకు తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి అప్పగించి మరింతగా కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని చూస్తున్నా,  ఆ పార్టీలోని సీనియర్ నాయకులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వస్తుండడం తో,  కాంగ్రెస్ అధిష్టానం సైతం రేవంత్ కు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చే విషయమై వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది.  ఎప్పటికప్పుడు ఆ పదవి తనకు వస్తుందని ఆయన అనుచరులు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు.

రేవంత్ ప్రాధాన్యమేమిటో గుర్తించిన బీజేపీ ఆయనను తమ పార్టీలో చేర్చుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.ఈ క్రమంలో ఆయనకు అనేక ఆఫర్లు కూడా బిజెపి ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక  రేవంత్ సైతం కాంగ్రెస్ లో ఉండి, తన రాజకీయ భవిష్యత్తును త్యాగం చేసే కంటే బిజెపిలో చేరాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

 కాంగ్రెస్ అధిష్టానం మాత్రం త్వరలోనే పిసిసి అధ్యక్ష పదవి ఇస్తామని తొందరపడవద్దని రేవంత్ కు సమాచారం ఉన్నట్లుగా తెలుస్తోంది.అయితే ఈ విషయంలో సొంత పార్టీ నేతల నుంచి అభ్యంతరాలు ఉన్న క్రమంలో మరికొద్ది రోజులు వేచిచూడాలని,  అప్పటిలోగా అధిష్టానం పెద్దలు స్పందించి తనకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టకపోతే ఆలస్యం చేయకుండా బీజేపీ లోకి వెళ్లాలనే అభిప్రాయంలో ఉన్నారట.అంటే పిసిసి అధ్యక్ష పదవి వస్తే కాంగ్రెస్ లో ఉండిపోవాలని, లేకపోతే బిజెపిలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా రేవంత్ కనిపిస్తున్నారు.

#Revanth Reddy #Congress #Telangana #CongressWorking

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు