మెగా స్టార్  చిన్నప్పటి పాత్రలో రామ్ చరణ్..?  

Will Ram Charan Play Young Chiranjeevi Role In Chiru Upcoming Movie - Telugu Chiranjeevi News, Ram Charan, Ram Charan Acharya Movie News, Ram Charan Latest Movie News, Ram Charan Movie News, Ram Charan News, Tollywood

ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన అందాల తార త్రిష నటిస్తోంది.

Will Ram Charan Play Young Chiranjeevi Role In Chiru Upcoming Movie - Telugu News Acharya Latest Tollywood

అయితే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పలు కీలక సన్నివేశాలు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో స్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేగాక ఇప్పటికే రామ్ చరణ్ తేజ్ కూడా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొన్నట్లు సినీ విశ్లేషకుల సమాచారం.

అయితే ఇందులో రామ్ చరణ్ చిరంజీవి చిన్నప్పుడు కనిపించే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ కి సంబంధించినటువంటి సన్నివేశాలు దాదాపుగా 30 నిమిషాల నిడివి కలిగి ఉన్నట్లు సమాచారం.

అలాగే రామ్ చరణ్ సరసన ఈ సన్నివేశాల్లో బాలీవుడ్ గ్లామర్ క్వీన్ కియారా అద్వానీ నటిస్తున్నట్లు ఇప్పటికే పలు వార్తలు వినిపించాయి.

అయితే ఇది ఇలా ఉండగా గతంలో కూడా చిరంజీవి సినిమాలో రామ్ చరణ్ తేజ్ నక్సలైట్ పాత్రలో నటిస్తున్నట్లు పలు వార్తలు వినిపించాయి.అయితే అప్పుడు కూడా చిత్ర యూనిట్ సభ్యులు ఈ వార్తలపై స్పందించలేదు.దీంతో మెగా అభిమానులు ఇవన్నీ వట్టి పుకార్లే అని కొట్టిపారేశారు.

మరి ఈసారైనా రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటిస్తున్నాడా లేదా అన్న ఈ విషయంపై చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.

అయితే ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి “ఆచార్య” అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం.

అంతేకాక దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.దీంతో మెగా అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గతంలో సైరా నరసింహారెడ్డి చిత్రంతో ప్రేక్షకులను నిరాశ పరిచినటువంటి చిరంజీవి ఈసారైనా తన ప్రేక్షకుల అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి.

తాజా వార్తలు

Will Ram Charan Play Young Chiranjeevi Role In Chiru Upcoming Movie-ram Charan,ram Charan Acharya Movie News,ram Charan Latest Movie News,ram Charan Movie News,ram Charan News,tollywood Related....