ఆచార్య సరే.. సిద్ధ పరిస్థితి ఏమిటి?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించేందుకు మెగాస్టార్ మరోసారి రెడీ అవుతున్నాడు.

 Will Ram Charan Be Seen In Acharya Teaser, Ram Charan, Acharya, Chiranjeevi, Tea-TeluguStop.com

కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఆచార్య చిత్రం ఎలాంటి సెన్సేషనల్ హిట్ అందుకుంటుందా అని అందరూ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాను సోషల్ మెసేజ్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా కొరటాల తనదైన స్టయిల్‌లో తీర్చిదిద్దుతున్నాడు.

కాగా ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల చరణ్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు.

కాగా ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో చరణ్ ప్రేక్షకులను మెప్పించనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.అయితే ఈ సినిమా టీజర్‌ను జనవరి 26న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఈ టీజర్ కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ టీజర్‌లో చిరంజీవి ఎలాంటి లుక్‌లో కనిపిస్తాడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ టీజర్‌లో సిద్ధ పాత్రలో చరణ్ మనకు కనిపిస్తాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఆచార్య టీజర్‌లో చిరంజీవితో పాటు ఎవరెవరిని చూపిస్తారా అని మెగాఫ్యాన్స్ ఎంతో ఆతృతగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఎండోమెంట్ ఆఫీసర్‌గా చిరంజీవి నటిస్తుండగా, ఆయన సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఓ హీరోయిన్ కూడా ఉండబోతుందని చిత్ర యూనిట్ పేర్కొంది.

కాగా ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.మరి ఆచార్య చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంతో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube