సాయి తేజ్ సినిమాలో ఆర్. నారాయణ మూర్తి.....?  

Will R Narayana Murthy Play Important Role In Sai Tej Movie-narayana Murthy Movie News,r Narayana Murthy,sai Tej Movie,sai Tej Movie News,solo Brathuke So Better,tollywood News

మెగా సుప్రీం హీరో సాయి తేజ్ ప్రస్తుతం నటిస్తున్నటువంటి చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్”.ఈ చిత్రానికి నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు.

Will R Narayana Murthy Play Important Role In Sai Tej Movie-Narayana Movie News R Sai Solo Brathuke So Better Tollywood

అయితే ఈ చిత్రంలో సాయి తేజ్ కి జోడీగా ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన భామ నభా నటేష్ నటిస్తోంది.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు వాలెంటెన్స్ డే కానుకగా సింగిల్స్ థీమ్ అనే పేరుతో 1.13 నిమిషాల నిడివి గల వీడియో ని విడుదల చేశారు.

అయితే సింగిల్స్ థీమ్ వీడియోలో విలక్షణ నటుడు ఆర్.

నారాయణ మూర్తి పోస్టర్ కనబడటంతో ఈ చిత్రంలో ఆర్.నారాయణ మూర్తి కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నట్లు పలు  వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో సాయి తేజ్ మరో కొత్త ప్రయోగాన్ని చేస్తున్నట్లు తెలుస్తోంది.ఏదేమైనప్పటికీ ఆర్ నారాయణ మూర్తి సాయి ధరమ్ తేజ్ సినిమాలో కనిపిస్తే మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు సాయి అభిమానులు.

అయితే ఇది ఇలా ఉండగా దర్శకుడు సుబ్బు ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పలు కీలక సన్నివేశాలు చిత్రీకరణ ఇప్పటికే పూర్తయినట్లు తెలిపాడు.అంతేకాక ఈ చిత్రాన్ని మే ఒకటో తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సాయి తేజ్ కెరియర్ వరుస హిట్ సినిమాలతో దూసుకు పోతోంది.గతంలో సాయి తేజ్ నటించిన టువంటి చిత్రలహరి, ప్రతి రోజు పండుగే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి.

అంతేగాక ఈ చిత్రాల దర్శక నిర్మాతలకు కూడా బాగానే వసూళ్ళు సాధించి పెట్టాయి.మరి సాయి తేజ్ “సోలో బ్రతుకే సో బెటర్” చిత్రంతో హిట్ కొట్టి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేస్తాడా లేదో చూడాలి.

తాజా వార్తలు

Will R Narayana Murthy Play Important Role In Sai Tej Movie-narayana Murthy Movie News,r Narayana Murthy,sai Tej Movie,sai Tej Movie News,solo Brathuke So Better,tollywood News Related....