త్వ‌ర‌లోనే బైక్ మీద ముగ్గురు వెళ్లేందుకు ప‌ర్మిష‌న్ ఇస్తారంట‌.. ఎందుకంటే..?

Will Permission Be Given For Three People To Go On A Bike Soon

బైక్ వేసుకుని బ‌య‌ట‌కు వెళ్లాలంటేనే ఇప్పుడు భ‌య‌ప‌డే ప‌రిస్థితులు వ‌స్తున్నాయి.చాలామంది రూల్స్ అతిక్ర‌మిస్తే ఎలాంటి ఫైన్లు ప‌డుతున్ఆన‌యో చూస్తేనే ఉన్నాం.

 Will Permission Be Given For Three People To Go On A Bike Soon-TeluguStop.com

హెల్మెట్ లేక‌పోయినా లేదంటే బైక్‌కు సంబంధించిన ప‌త్రాలు లేక‌పోయినా స‌రే ఫైన్లు, శిక్ష‌లు ఓ రేంజ్ లో ఉంటున్నాయి.ఇక ముగ్గురు బైక్ మీద వెళ్తే ఏ స్థాయిలో పోలీసులు రియాక్ష‌న్ చూపిస్తారో అంద‌రికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు ఇలా ముగ్గురు వెళ్లేందుకు అనుమ‌తి ఇస్తార‌ని తెలుస్తోంది.అదేంటి ఇన్ని రోజులు గ‌వ‌ర్న‌మెంట్ వ‌ద్ద‌ని ఇప్పుడు ప‌ర్మిష‌న్ ఎలా ఇస్తార‌నుకుంటున్నారా.

 Will Permission Be Given For Three People To Go On A Bike Soon-త్వ‌ర‌లోనే బైక్ మీద ముగ్గురు వెళ్లేందుకు ప‌ర్మిష‌న్ ఇస్తారంట‌.. ఎందుకంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇక్క‌డే ఓ కార‌ణం కూడా ఉంది.అదేంటంటే మ‌న దేశంలో ఇప్పుడు పెట్రోల్ ధరల మంటలు ఎంత‌లా భ‌గ‌భ‌గ మంటున్నాయో అంద‌రికీ తెలిసిందే.సామాన్యులను ఈ ధ‌ర‌ల మంటు దహించివేయ‌డం కూడా చూస్తున్నాం.గ‌త చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంత‌గా పెట్రోల్ ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి.

ఏడాది కాలంగా పైకి పెర‌గ‌డ‌మే తప్ప కిందికి రావ‌డం మాత్రం క‌న‌ప‌డ‌ట్లేదు.ఇప్పటికే చాలా రాష్ట్రా్లో రూ.111 దాటిపోయింది.ఇప్పుడు పెట్రోల్ మంట‌ల‌పై అస్సోంకు చెందిన బీజేపీ లీడ‌ర్ కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి.

Telugu Assam State Leader, Bhatish, Three People On Bike, Viral News, Will Permission Be Given For Three People To Go On A Bike Soon-Latest News - Telugu

అదేంటంటే ప్ర‌స్తుతం అసోం రాష్ట్ర అధ్యక్షుడు భబేష్ కలిత చేసిన కామెంట్లు అక్క‌డి రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయాయి.అదేంటంటే త‌మ రాష్ట్రంలో పెట్రోల్ ధరలు రూ200కి చేరుకున్న‌ప్పుడు బైక్ మీద ముగ్గురు వెళ్లేందుకు ప‌ర్మిష‌న్ ఇస్తారంటూ చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది.ప్ర‌స్తుతం ఇద్ద‌రికి ప‌ర్మిష‌న్ ఉంద‌ని త్వ‌ర‌లోనే ఇది కాస్తా ముగ్గురుకు చేరుతుంద‌ని ఆయ‌న చెప్పారు.దాన్ని బ‌ట్టి పెట్రోల్ ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని కూడా తెలుస్తోంద‌ని నెటిజ‌న్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

ఇక ప్రతిపక్షాలు కూడా భ‌గ్గుమంటున్నాయి.పెట్రోల్ ధ‌ర‌లు పెరుగుతాయ‌ని ఇలా కామెంట్లు చేయ‌డ‌మేంట‌ని ఫైర్ అవుతున్నారు ప్ర‌జ‌లు.

#Bhatish #Bike #Assam #Bike

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube