పవన్ ఫస్ట్‌ షూటింగ్‌లో జాయిన్‌ అవుతాడా.. ప్రజల్లోకి వెళ్తాడా?

పవన్‌ కళ్యాణ్‌ కరోనా నుండి కోలుకున్నాడు.ఆయనకు ఆర్టీపీసీ టెస్టులో నెగటివ్ వచ్చింది అంటూ ఇటీవలే జనసేన పార్టీ మీడియా సెల్‌ నుండి విడుదల అయిన ప్రెస్‌ నోట్ లో పేర్కొన్నారు.

 Will Pawan Kalyan Join Movie Shooting Or Political Programs-TeluguStop.com

పవన్‌ పూర్తిగా కోలుకున్నాడు.కాని కరోనా వల్ల ఆయన కాస్త నీరసంగా ఉన్నారంటూ వారు పేర్కొన్నారు.

ఒకటి రెండు వారాల్లో ఆయన పూర్తిగా మామూలు మనిషి అవ్వడం ఖాయం అంటున్నారు.గత నెల రోజులుగా హైదరాబాద్‌ లోని తన ఫామ్ హౌస్ లో నే పవన్‌ ఉంటున్నారు.

 Will Pawan Kalyan Join Movie Shooting Or Political Programs-పవన్ ఫస్ట్‌ షూటింగ్‌లో జాయిన్‌ అవుతాడా.. ప్రజల్లోకి వెళ్తాడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పవన్‌ కరోనా నుండి కోలుకున్న వెంటనే సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వబోతున్నాడా లేదంటే ఏపీకి వెళ్లి జిల్లాల్లో పర్యటిస్తాడా అనేది చూడాలి.పలు జిల్లాల్లో ఉన్న సమస్యలపై మరియు పెరుగుతున్న కరోనా కేసుల విషయమై పవన్‌ కళ్యాణ్‌ ఏపీలో పర్యటించే అవకాశం ఉందని అంటున్నారు.

మరో వైపు పవన్ కళ్యాణ్ కోసం క్రిష్‌ మరియు సాగర్ చంద్రలు వెయిట్‌ చేస్తున్నారు. అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ సినిమా ను మే నెలలో పూర్తి చేయాలన భావించారు.

కాని కరోనా కారణంగా సినిమా ఆగిపోయింది.వెంటనే ఆ సినిమా ను పునః ప్రారంభించి మూడు వారాల షెడ్యూల్‌ తో గుమ్మడి కాయ కొట్టేయాలని దర్శకుడు సాగర్‌ చంద్ర భావిస్తున్నాడు.

మరో వైపు హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ ను శరవేగంగా పూర్తి చేసి గ్రాఫిక్స్ వర్క్‌ కు వెళ్లాలని భావిస్తున్నాడు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా ను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు.

అందుకే ఈ రెండు సినిమాల చిత్రీకరణ మొదలు పెట్టి వెంటనే పూర్తి చేయాలని ఆయా దర్శకులు కోరుకుంటున్న నేపథ్యంలో ఏం పవన్ ఎటు వైపు అడుగులు వేస్తాడు అనేది అందరికి ఆసక్తికరంగా మారింది.

#HariHara #Pawan Kalyan #Janasena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు