లాయర్ పాత్రలో ఎన్టీఆర్ ఒకే కానీ మరి పవన్ సంగతి ఏంటీ..?

టాలీవుడ్ పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దాదాపుగా మూడు సంవత్సరాలకు పైగా గ్యాప్ తీసుకుని ఇటీవలే వకీల్ సాబ్ అనే చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నాడు.

 Will Pawan Kalyan Impress Mass Audience In Lawyer Role,  Pawan Kalyan Vakeel Saa-TeluguStop.com

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మగువా, మగువా అనే పాట కూడా విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

అయితే ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు.

దీంతో నెటిజన్లను బాగానే ట్రోల్స్ చేస్తున్నారు.అయితే గతంలో నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టువంటి స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా లాయర్ పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా మెప్పించాడు.

దీంతో పవన్ కళ్యాణ్ మొదటిసారి లాయర్ పాత్రలో నటిస్తుండడంతో ఈ చిత్రంలోని పవన్ కళ్యాణ్ పాత్ర పై మరింత ఆసక్తి పెరిగింది.అంతేకాక కొంతమంది సినీ అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ లాగే పవన్ కళ్యాణ్ కూడా లాయర్ పాత్రలో బాగానే మెప్పిస్తాడని అనడంలో ఎటువంటి సందేహం లేదని అంటున్నారు.

అయితే ఈ చిత్రంపై పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం భారీ అంచనాలే పెట్టుకున్నారు.ఎందుకంటే దాదాపుగా మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ ఉండడంతో పవన్ అభిమానులు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

Telugu Pawankalyan, Vakeel Saab, Vakeelsaab-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్లు సమాచారం.అంతేగాక ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు దర్శకుడు శ్రీరామ్ వేణు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల ఈ చిత్రానికి సంబంధించి నటువంటి కొన్ని టెక్నికల్ పనులు వాయిదా పడ్డాయి.దీంతో అనుకున్న సమయానికే చిత్రాన్ని విడుదల చేస్తారో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube