పవన్‌ కళ్యాణ్‌ సినిమా చేయబోతున్నాడట... హైదరాబాద్‌ చేరి కథలు కూడా వింటున్నాడు  

Will Pawan Do Movies After Elections Result-elections Result 2019,janasena,pawan Kalyan

పవన్‌ కళ్యాణ్‌ జనసేన ఎన్నికల్లో ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పవన్‌ జనసేన పార్టీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లను దక్కించుకుంటుందనే విషయంపై క్లారిటీ లేదు. తలపండిన రాజకీయ నాయకులు కొందరు పవన్‌ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒకటి గెలుస్తాడని, మరెక్కడ కూడా జనసేన పార్టీ కనీసం రెండవ స్థానంలో కూడా నిలువ లేదు అంటూ చెబుతున్నారు..

పవన్‌ కళ్యాణ్‌ సినిమా చేయబోతున్నాడట... హైదరాబాద్‌ చేరి కథలు కూడా వింటున్నాడు-Will Pawan Do Movies After Elections Result

పవన్‌ ఈ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేక పోయాడు అనేది చాలా మంది మాట. అందుకే పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ సినిమాలు చేసుకోవాలని భావిస్తున్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో ఏపీ వారు ఉండటంకు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఏపీ వారు హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసుకోవడంకు మరియు సినిమాలు చేయడంకు అక్కడ వారికి భయపడుతూ ఉండాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్‌ కళ్యాణ్‌ మూడు రోజుల క్రితం హైదరబాద్‌ చేరుకున్నాడు.

హైదరాబాద్‌లో తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న పవన్‌ కళ్యాణ్‌ గత కొన్ని రోజులుగా పెంచిన గడ్డంను తొలగించి క్లీన్‌ షేవ్‌తో ఉన్నాడట. ఇటీవల ఇద్దరు ముగ్గురు రచయితలు ఆయనకు కథలు వినిపించారని తెలుస్తోంది.

ఎన్నికల ఫలితాలను బట్టి పవన్‌ కళ్యాణ్‌ సినిమా చేసే అవకాశం ఉందంటున్నారు. జనసేనకు ప్రజలు జై కొట్టకుంటే ఖచ్చితంగా పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు చేస్తాడు.

అయితే పాతిక సీట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రం ఖచ్చితంగా సినిమాలకు గుడ్‌ బై చెప్తాడని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు అనధికారికంగా చెబుతున్నారు. మొత్తానికి పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లో రాణించకుంటే సినిమాల్లోకి రావడం ఖాయం అనేది తేలిపోయింది. అందుకోసం ముందే కథలు వింటుండటం కూడా పవన్‌ ఫలితాలపై ఒక అవగాహణకు వచ్చినట్లుగా తెలుస్తోంది..

పవన్‌ కళ్యాణ్‌ సినిమా ఇదే ఏడాది వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ మూవీ కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఏం జరుగుతుందా అంటూ పవన్‌ ఫ్యాన్స్‌ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.