రామరాజును భీం ఫాలో అవుతాడా?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Ntr, Rrr, Ram Charan, Six Pack, First Look-TeluguStop.com

ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఇటీవల రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చి పడింది.

దీంతో తారక్ నటిస్తున్న కొమురం భీం పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.అయితే ఈ పోస్టర్‌లో తారక్ సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తాడా అనే అంశం చర్చనీయాంశంగా మారింది.

రామ్ చరణ్ ఇప్పటికే సిక్స్ ప్యాక్‌తో చొక్కా లేకుండా కనిపించాడు.

మరి తారక్ కూడా అదే విధంగా చొక్కా లేకుండా కనిపిస్తాడా? అనేది చూడాలి.మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube