నిమ్మ‌గ‌డ్డ చివ‌ర‌కు ఆ ప‌ని చేసైనా ప‌రువు నిలుపుకుంటారా ?

రాష్ట్రంలో స్థానిక ఎన్నిక‌ల విష‌యంపై తాజాగా హైకోర్టు వెలువ‌రించిన తీర్పును ప్ర‌భుత్వ వ‌ర్గాలు స్వాగ‌తిస్తున్నాయి.అదేస‌మ యం లో అధికార పార్టీ వైసీపీ కూడా ఈ తీర్పును స్వాగ‌తించింది.

 Will Nimmagadda Retain The Reputation Of Doing That Work ,ap,ap Political News,l-TeluguStop.com

అయితే. స్థానిక ఎన్నిక‌ల షెడ్యూల్‌ను నిలుపుద‌ల చేస్తూ.

హైకోర్టు ఏక స‌భ్యధ‌ర్మాస‌నం మాత్ర‌మే తీర్పు చెప్ప‌డంతో దీనిని స‌వాల్ చేసేందుకు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు అవ‌కాశం ఏర్ప‌డింది.సుప్రీం కోర్టు దాకా కూడా వెళ్ల‌కుండా.

డివిజ‌న్ బెంచ్‌కు వెళ్లి దీనిని స‌వాలు చేయాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ భావిస్తు న్న‌ట్టు అప్పుడే వార్త‌లు గుప్పుమ‌న్నాయి.అయితే.

దీనిపై మెజారిటీ మేధావులు మాత్రం ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నా రు.

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఇప్పుడు రోడ్డెకెక్కింద‌నే బావ‌న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.నిజానికి గ‌త ఏడాది స్థానిక ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌డం, త‌ర్వాత ప్ర‌భుత్వం వ‌ర్సెస్ ఎన్నిక‌ల‌క‌మిష‌న‌ర్‌గా ఉన్న నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌లు వివాదానికి దిగ‌డం రాష్ట్ర వ్యాప్తంగా ఇది ర‌చ్చ‌కు దారితీయడం వ‌ర‌కు చాలా మంది ప్ర‌జ‌ల‌కు రాష్ట్రంలోనూ ఎన్నిక‌ల క‌మిష‌న్ ఒక‌టి ఉంటుంద‌నే విష‌యం కూడా తెలియ‌దు.ఇక‌, అప్ప‌ట్లో స‌హేతుక కార‌ణంగా చూపుతూ.

నిమ్మ‌గ‌డ్డ వాయిదా వేయ‌డాన్ని చాలా మంది స్వాగ‌తించారు.

Telugu Andhra Pradesh, Ap, Jagan, Latest, Nimmagadda, Panchayat, War-Telugu Poli

అయితే.ఇప్పుడు ఇదే కార‌ణంతో ప్ర‌బుత్వం వాయిదా కోరుతుండ‌డం.నిమ్మ‌గ‌డ్డ ఏకోన్ముఖంగా ముందుకు సాగుతుండ‌డం.

తాజాగా హైకోర్టులో తీర్పు వ్య‌తిరేకంగా రావ‌డంతో ఎన్నిక‌ల క‌మిష‌న్ ప‌రువు పోతోంద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.సీనియ‌ర్ ఐఏఎస్‌గా రిటైరైన నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ కారణంగా.

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ భ్ర‌ష్టు ప‌డుతోంద‌ని ప‌లువురు మేధా వులు సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు.ఈ క్ర‌మంలో ప‌ట్టుద‌ల‌ల‌కు పోయి.

హైకోర్టు సింగిల్ జ‌డ్జి ఇచ్చిన ఉత్త‌ర్వులు గౌర‌వించ‌డం ద్వారా ప్ర‌భుత్వానికి క‌న్నా కూడా నిమ్మ‌గ‌డ్డ‌కే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయ‌ని చెబుతున్నారు.

రాజ్యాంగ బ‌ద్ధ సంస్థ‌గా ఉన్న ఎన్నిక‌ల సంఘం.

మ‌రో రాజ్యాంగ బ‌ద్ధ కీల‌క సంస్థ అయిన న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను గౌర‌వించ‌డంతో పాటు.ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కూడా ఫ‌ణంగా పెట్ట‌డానికి ఎన్నిక‌ల సంఘం సిద్ధంగా లేద‌న్న సంకేతాల‌ను పంపిన‌ట్టు అవుతుంద‌ని అంటున్నారు.

ఈ విష‌యంలో ఒక అడుగు వెన‌క్కి వేయ‌డం ద్వారా నిమ్మ‌గ‌డ్డ వ్య‌క్తిగ‌తంగానే కాకుండా ఎన్నిక‌ల సంఘం పెద్ద‌రికాన్ని సైతం నిలిపిన‌ట్టు అవుతుంద‌నే సూచ‌న‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube