నాని ఈసారి కొత్తగా ట్రై చేస్తాడా?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’కు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

 Will Nani Try New For Tuck Jagadish, Tuck Jagadish, Nani, Shiva Nirwana, Tollywo-TeluguStop.com

ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు నాని రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను పూర్తి ఎంటర్‌టైనర్ మూవీగా తీర్చిదిద్దుతుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇఫ్పటికే శరవేగంగా జరుగుతుండటంతో ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఇప్పటివరకు ఈ సినిమా నుండి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడం, నాని లాస్ట్ మూవీ ‘వి’ ఫ్లాప్‌గా నిలవడంతో ఆయన అభిమానులు టక్ జగదీష్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ క్రమంలో క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తే బాగుంటుందని వారు అనుకుంటున్నారు.

అయితే ప్రతిసారి నాని రిలీజ్ చేసే ఫస్ట్ లుక్ పోస్టర్స్‌లా కాకుండా కాస్త కొత్తగా ట్రై చేయాలని టక్ జగదీష్ చిత్ర యూనిట భావిస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఎవరూ ఊహించని విధంగా డిజైన్ చేస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా రీతూ వర్మ నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.మరి టక్ జగదీష్ చిత్రం ఎలాంటి కథతో వస్తుందా, ఈ సినిమాతో నాని హిట్ కొడతాడా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube