‘ఆస్కార్’ అవార్డ్స్ కి నాని ‘దసరా’..#RRR ని డామినేట్ చేస్తుందా?

ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించిన చిత్రాలలో ఒకటి ‘దసరా’.( Dasara ) తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాని హీరో గా నటించిన ఈ సినిమా విడుదల రోజు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని అందుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపించింది.

 ‘ఆస్కార్’ అవార్డ్స్ కి నాన-TeluguStop.com

తెలంగాణ తో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సినిమా అంత గొప్పగా ఆడలేదు కానీ, ఎక్కడా కూడా లాస్ మాత్రం తీసుకొని రాలేదు.ఓవరాల్ గా 65 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా, ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 3 చిత్రాలలో ఒకటిగా నిల్చింది.

ఇక కొన్ని రోజుల తర్వాత ఓటీటీ లో విడుదల చేస్తే అందులో కూడా ఈ సినిమాకి రెస్పాన్స్ అదిరింది.

Telugu Dasara, Keerthy Suresh, Nani, Ram Charan, Rrr, Tollywood-Movie

బాక్స్ ఆఫీస్ పర్వం ముగిసింది, ఇప్పుడు అవార్డులు రివార్డుల పర్వం మొదలైంది.కచ్చితంగా ఈ సినిమాకి అవార్డ్స్ రావాల్సిందే, ఎందుకంటే నాని ఈ చిత్రం లో అద్భుతంగా నటించాడు, సినిమాకి పని చేసిన ప్రతీ టెక్నీషియన్ తన పనితనం లో బెస్ట్ చూపించాడు.స్టోరీ మామూలిదే అయినా, స్క్రీన్ ప్లే మరియు ఎంచుకున్న బ్యాక్ గ్రౌండ్ మొత్తం కూడా చూసే ప్రేక్షకులకు బాగా నచ్చింది.

అందుకే ఈ చిత్రానికి కల్ట్ క్లాసిక్ స్టేటస్ వచ్చింది.ఈ సినిమాని ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కి పంపబోతున్నట్టు సమాచారం.అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తి అయ్యాయి అట.ఈ ఏడాది లో #RRR చిత్రానికి ఆస్కార్ అవార్డు వచ్చింది.మన ఇండియన్ సినిమాకి ఆస్కార్ నామినేషన్స్ కి తలుపులు తెరిచింది.ఈ చిత్రం లోని కొన్ని షాట్స్ హాలీవుడ్ సినిమాలలో కూడా లేవు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Telugu Dasara, Keerthy Suresh, Nani, Ram Charan, Rrr, Tollywood-Movie

ముఖ్యంగా ఇంటర్వెల్ షాట్ కి ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు, అలాంటి షాట్స్ ఈ చిత్రం లో చాలానే ఉన్నాయి.మరి ఆస్కార్ అవార్డ్స్ ( Oscar Awards 0కమిటీ ఈ సినిమాని పెరిగినలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.తెలుగు లో సూపర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రం ఇతర భాషల్లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు.కానీ ఓటీటీ లో విడుదల చేసినప్పుడు మాత్రం మిగిలిన భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

ఈ చిత్రం తో పాటుగా బలగం సినిమాని కూడా ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కి పంపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube