ముద్రగడ దీక్ష...ఇందుకేనా..మరీ ఇంత దారుణమా   Will Mudragada Padmanabham Join YSRCP?     2018-04-04   06:49:24  IST  Bhanu C

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ పేరుని కాపులు అందరూ ఓన్ చేసుకున్నారు..కాపుల హక్కుల కోసం పోరాడే నాయకుడు మాకోసం వచ్చాడు అంటూ సంబరాలు చేసుకున్నారు..మీడియాలో ఒక్కసారిగా పద్మనాభం హైలెట్ అయ్యారు…కాపుల తరుపున హీరో అయ్యిపోయారు.ఒక్కసారిగా అమాంతం పెరిగిన ఆయన ఇమేజ్ అదే రేంజ్ లో కిందకి పడిపోయింది. అయితే ఎంతో ఇమేజ్ ఉన్న ముద్రగడ ఒక్కసారిగా డౌన్ అయ్యిపోవడానికి కారణం ఆయన చేసుకున్న స్వయంకృతాపరాదాలే..

అయితే కాపు ఉద్యమ నేేతగా ఉన్న ముద్రగడ వైసీపీకి, ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌కు అనుకూలంగా ఉంటున్నారు అనే విమర్శలు అనేకం వచ్చాయి అయితే ఇదే విషయం నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కాపులు త‌మ ఓట్లున్ని వైసీపీ వైపే వేయాల‌ని ముద్ర‌గ‌డ తెర‌వెన‌క మంత్రాంగం నడిపాడు అనే విమర్శలకి ఊతం ఇచ్చాయి..ముద్రగడ ఎన్ని జిమ్మిక్కులు చేసినా సరే ఆ ఎన్నికల్లో గెలుపు టిడిపికి దక్కింది..దాంతో ముద్రగడ ప్రాబల్యం తగ్గడంతో ఆయన మరోమారు పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు..

అయితే తన రాజకీయ వారసుడిగా ముద్రగడ
త‌న కుమారుడి కి మార్గం సుగమం చేస్తున్నారు.. ఇంకా చెప్పాలంటే వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర తూర్పు గోదావ‌రి జిల్లాకు చేరుకోగానే ముద్ర‌గ‌డ వైసీపీ ఎంట్రీ ఉంటుంద‌ని..ఈ మేరకు జగన్ ఎప్పుడో ముద్రగడకి హామీ ఇచ్చారని అంటున్నారు..అంతేకాదు ఎక్కడి నుంచి తన కొడుకు పోటీ చేస్తాడో ఆ సీటు రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు ముద్రగడ పత్తిపాడు టికెట్‌ను ముద్ర‌గ‌డ‌ కుమారుడికి ఇవ్వాలని ముద్ర‌గ‌డ జ‌గ‌న్ ముందు డిమాండ్ పెట్టాడ‌ట‌. ఇందుకు జ‌గ‌న్ కూడా సూత్రాభిప్రాయంగా అంగీక‌రించిన‌ట్టే తెలుస్తోంది.

అయితే జగన్ ఎందుకు ముద్రగడకి ఆ హామీ ఇచ్చాడంటే వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరి పోరు చేయక మానదు..అదే సమయంలో పవన్ జగన్ కి మద్దతు ఇస్తాడా లేదా అనేది చెప్పలేము అందుకే ముద్ర‌గ‌డ లాంటి వాళ్లు త‌న వైపు ఉంటే కాపులు కొంత మంది అయినా వైసీపీ ఉంటార‌ని భావించిన జ‌గ‌న్ ఆయ‌న్ను పార్టీలో చేర్చుకుని ఆయన తనయుడికి టిక్కెట్టు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడట..