ఆ లిస్టులో మంత్రి బొత్స ఉంటారా.. జ‌గ‌న్ నిర్ణ‌యం ఏంటి..?

వైసీపీ ఇప్పుడు ఏపీలో తిరుగులేని మెజార్టీతో దూసుకుపోతుంది.ఇలాంటి స‌మ‌యంలో ఆ పార్టీకి అస‌లు తిరుగుండ‌ద‌ని అంద‌రికీ తెలిసిందే.

 Will Minister Botsa Be On That List What Is The Decision Of Jagan-TeluguStop.com

ఇలాంటి త‌రుణంలో పార్టీలో వ‌ర్గ విభేదాలు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని జ‌గ‌న్‌కు ముందే తెలుసు.ఇప్ప‌టికే పార్టీలో సీనియ‌ర్ల వ‌ర్సెస్ జూనియ‌ర్లు అన్న మాదిరిగా కొన్ని జిల్లాల్లో పోరు న‌డుస్తోంది.

ఇక జ‌గ‌న్ కూడా యువ‌కుడే కాబ‌ట్టి రాబోయే రోజుల్లో త‌న వెంట బ‌ల‌మైన యువ నేతలు ఉండాల‌ని ఆలోచిస్తున్నారు జ‌గ‌న్‌.అందుకే ఇప్పుడు పార్టీలో చాలామంది సీన‌యర్లు ఉండ‌గా వారంద‌రికీ ప్ర‌భుత్వంలో స్థానం త‌గ్గించాల‌ని చూస్తున్నారు.

 Will Minister Botsa Be On That List What Is The Decision Of Jagan-ఆ లిస్టులో మంత్రి బొత్స ఉంటారా.. జ‌గ‌న్ నిర్ణ‌యం ఏంటి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక వైసీపీలో చాలామంది సీనియర్ మినిస్ట‌ర్లు ఉండ‌గా వారిలో చాలామందికి ఉద్వాస‌న ప‌లుకాల‌ని జ‌గ‌న్ ఆలోచిస్తున్నారంట‌.ఇందులో ఉండే కొంద‌రిని త‌న‌కు స‌ల‌హాదారులుగా పార్టీలో కీల‌కంగా బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని చూస్తున్నారు జ‌గ‌న్‌.

కాగా ఈ లిస్టులో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.వాస్త‌వానికి జ‌గ‌న్‌కు మొద‌టి నుంచి అండ‌గా ఉన్న నేత‌ల్లో ఈయ‌న ఒక‌రు.

ఉత్తరాంధ్రలో పార్టీ ఇంత‌లా బ‌ల‌ప‌డ‌టానికి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌ధాన కార‌ణం అని చెప్పొచ్చు.ఇక మంత్రి వర్గ విస్తరణలో భాగంగా ఈయ‌న్ను మారుస్తార‌నే ప్రచారం బాగానే జ‌రుగుతోంది.

Telugu Ap Cm Jagan, Botsa Satyanarayana, Group Politics, Jagan, Minister Botsa Satyanarayana Key Post, Ycp, Ycp Leaders, Ycp Minister, Ycp Senior Leaders-Telugu Political News

కాగా మంత్రి బొత్స‌ను మాత్రం పార్టీ కార్యకలాపాల కోసం ఉప‌యోగిస్తార‌నే ప్ర‌చారం ఉంది.ఎందుకంటే పార్టీలో ఎప్ప‌టి నుంచో ఉన్న మంత్రి బొత్స‌కు మంచి ప‌ట్టుంది.అలాగే వ్యూహాలు ప‌న్న‌డంలో దిట్ట అనే పేరు కూడా ఉంది.ఇంకోవైపు పార్టీలో అంద‌రితోనూ మంచి స‌న్నిహిత్యం ఉంది.ఎవ‌రితోనూ పెద్ద‌గా విభేదాలు లేవు.ఇలాంటి కార‌ణాల‌తో పాటు మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ కు అత్యంత న‌మ్మ‌క‌స్తుడిగా కొనసాగుతున్నారు.

దీంతో ఆయ‌న‌కే పార్టీలో కీల‌క ప‌ద‌వి అప్ప‌గించి పార్టీని న‌డిపించే స్థాయిలో ఉంచుతార‌ని తెలుస్తోంది.చూడాలి మ‌రి ఆయ‌న ఎలాంటి రియాక్ష‌న్ ఇస్తారో.

#YCP Senior #AP CM Jagan #YCP #YCP #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు