భారతీయుల బహిష్కరణ .. జైశంకర్‌తో మాట్లాడతా : పంజాబ్ మంత్రి

అమెరికాలో( America ) అక్రమంగా నివసిస్తున్న భారతీయులు( Indians ) సహా అక్రమ వలసదారులను అక్కడి ప్రభుత్వం వారి స్వదేశాలకు తరలిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే 104 మంది భారతీయ వలసదారులతో కూడిన విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్ విమానాశ్రయానికి చేరుకుంది.

అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారిలో పంజాబీలు ఎక్కువగా ఉన్నారు.ఈ పరిణామాలపై పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్( Punjab NRI Minister Kuldeep Singh Dhaliwal ) కీలక వ్యాఖ్యలు చేశారు.

పంజాబీలను అమెరికా ప్రభుత్వం బహిష్కరించడంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌ను( MEA S Jaishankar ) త్వరలోనే కలుస్తానని ధాలివాల్ తెలిపారు.ఇప్పటికే ఆయన అపాయింట్‌మెంట్ కోరానని.

లోక్‌సభ సమావేశాల తర్వాత జైశంకర్‌ను కలుస్తానని చెప్పారు.విదేశాలకు వలసల సమస్యపై కేంద్రం, రాష్ట్రం సమిష్టిగా చేయగలిగే విషయాలపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో( Punjab CM Bhagwant Mann ) చర్చిస్తానని ధాలివాల్ చెప్పారు.

Advertisement

ఏజెంట్ల మోసాలు వెలుగుచూసిన తర్వాత కూడా బాధితులు వారిపై అధికారికంగా ఫిర్యాదు చేయడానికి ఇష్టపడరని కుల్దీప్ సింగ్ తెలిపారు.తాము పొగొట్టుకున్న డబ్బులో కొంతైనా తిరిగి ఇస్తారన్న ఆశతో బాధితులు ఉంటారని .కానీ ట్రావెల్ ఏజెంట్ల మోసాలపై ఫిర్యాదు చేయడానికి ప్రజలు ముందుకు రావాలని ఆయన కోరారు.అయితే ఎన్ఆర్ఐ వ్యవహారాల విభాగం గతంలో యువతను అక్రమ మార్గాల ద్వారా విదేశాలకు పంపిన పలువురు ట్రావెల్ ఏంజెట్లపై కేసులు నమోదు చేసిందని కుల్దీప్ సింగ్ ధాలివాల్ గుర్తుచేశారు.

ఇమ్మిగ్రేషన్ చట్టాలు కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తాయని.చట్టపరమైన చట్రాన్ని మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదన్నారు.పంజాబీల మృతదేహాలను విదేశాల నుంచి తరలించాల్సి వచ్చిన తప్పనిసరిగా కేంద్రాన్ని సంప్రదించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయని కేంద్రం నిర్ధారించుకోవాలని.అదే సమయంలో ప్రజలు కూడా తెలివిగా వ్యవహరించాలని, అక్రమ మార్గాలలో విదేశాలకు వెళ్లొద్దని కుల్దీప్ సింగ్ ధాలివాల్ తెలిపారు.

ఇమ్మిగ్రేషన్ చట్టాలు, నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం సెమినార్లు నిర్వహించి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తుందని మంత్రి వెల్లడించారు.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Advertisement

తాజా వార్తలు