రానున్న రోజుల్లో దళిత బంధు పైనే మెజారిటీ రాజకీయం జరగనున్నదా?

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రకాల సంక్షేమ పధకాలు అమలవుతున్నా ఇప్పుడు దళిత బంధు అనే పధకం మాత్రం ఏ ఇద్దరు కూర్చున్నా దళిత బంధు పధకం గురించే చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది.అయితే ఈ పధకం చాలా మంచి పధకమని, దళితుల జీవితాల్లో ఎంతో కొంత వెలుగులు తీసుకొస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

 Will Majority Politics Be Held On Dalit Kinship In The Coming Days Telangana Pol-TeluguStop.com

అయితే ఈ పధకంపై పెద్ద ఎత్తున రచ్చ రచ్చ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే.ఒక్క దళితులకే ఈ పధకం వర్తింపజేయడం ఏంటని బీసీలు బీసీ లలోని ఉప కులాలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపిన విషయం తెలిసిందే.

దీంతో ప్రభుత్వం కూడా దిగొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల వారికి కూడా రైతుబంధు అమలయ్యేలా చూస్తామని తెలిపిన విషయం మనకు తెలిసిందే.అయితే దళితబంధు సక్రమంగా అన్ని కులాల వారికి 10 లక్షలు ఇవ్వడం అన్నది ఈ దఫా ప్రభుత్వంలో సాధ్యపడుతుంది అనుకోవడం భ్రమే.

Telugu @cm_kcr, Huzurabad, Raitnhu Bandhu, Telangana, Tg, Trs-Political

కాని దళితబంధు కేంద్రంగానే మెజారిటీ రాజకీయం జరిగే అవకాశం కనిపిస్తోంది.అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటేంటంటే దళితబంధు పధకాన్ని ప్రజలు పాజిటివ్ గా తీసుకుంటే కేసీఆర్ ప్రభుత్వానికి తిరుగు ఉండదు.ఒకవేళ దళిత బంధు పధకాన్ని ప్రజలు విశ్వసించకుంటే  ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి వృధా అవుతుంది సరికదా.ఓట్లు రూపకంగా మారకపోతే రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది.

అంతేకాక ప్రతిపక్షాలు ప్రజల అసంతృప్తిని దృష్టిలో ఉంచుకొని వారిని రెచ్చగొట్టి పధకం ప్రయోజనం టీఆర్ఎస్ కు దక్కకుండా చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హీటెక్కడంలో దళితబంధు ప్రధాన పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube