పవన్, మహేష్ వార్ వన్ సైడ్ అయిపోతుందా ?

మెగాస్టార్ చిరంజీవి వదిలేసినప్పటినుంచి ఆ నెం.1 కుర్చీ అలాగే ఖాలిగా ఉంది.ఇద్దరు ప్రథమ పోటిదారులు ఉన్నారు.ఇన్నిరోజులు ఒకరు ఫామ్ లో ఉంటె మరొకరు ఫామ్ లో లేరు.ఇప్పుడు ఇద్దరు హిట్స్ కొట్టారు.అసలైన పోటి ఈ ఏడాది నుంచే మొదలు.

 Will Mahesh Dominate Pawan In No.1 Race ?-TeluguStop.com

వాళ్ళే మహేష్ బాబు.పవన్ కళ్యాణ్.

కాని రాబోయే పరిస్థితులు చూస్తోంటే ఇద్దరి మధ్య వార్ వన్ సైడ్ అయిపోతుందేమో అనిపిస్తోంది.

మహేష్ సినిమాల లైనప్ భీకరంగా ఉంది.

బ్రహ్మోత్సవం ఫ్యాన్స్ ని అలరిస్తుందో లేదో తెలియదు కాని, మహేష్ కి బలంగా ఉండే ఫ్యామిలి ఆడియెన్స్ ని అయితే ఖచ్చింతంగా మెప్పిస్తుంది.ఆ సినిమా గట్టేకితే చాలు.

ఆ తరువాతి సినిమా ఏఆర్.మురుగదాస్ తో.గజినీ,తుపాకీ,కత్తి … మురుగదాస్ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో మనకు తెలియనిది కాదు.మాస్ ఎలిమెంట్స్ అన్ని ఉంటూనే, సామాజిక సందేశం కూడా పెట్టడం మురుగదాస్ ప్రత్యేకత.

మళ్ళి ఈ చిత్రం తెలుగు,తమిళ భాషల్లో భారి ఎత్తున విడుదల అవడమే కాకుండా, హిందీలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.ఆ సినిమా గనుక హిట్ అయితే, రికార్డుల మోతే.

దాని తరువాత విక్రమ్ కుమార్ తో ఒక సినిమా చేయొచ్చు మహేష్.మురుగదాస్ తో మాస్ ని అలరించి, మళ్ళి క్లాస్ ప్రేక్షకుల మనసుల్ని టార్గెట్ చేస్తాడు మహేష్.

విక్రమ్ తో సినిమా అంటే మినిమం గ్యారెంటి.కొత్తదనం ఉన్నా, అందరికి అర్థమయ్యి నచ్చేలా తీస్తాడు ఈ దర్శకుడు.

ఆయన తీసిన మనం ఎలాంటి అధ్బుతమో మనకు తెలియంది కాదు.ఈ రెండు సినిమాలు అయిపోతే, పెద్ద గేమ్ మొదలుపెడతాడు మహేష్.

అదే రాజమౌళి సినిమా.దాని రికార్డుల గురించి మాట్లాడి మాట్లాడి అలసిపోతామేమో మనం.

మరోవైపు పవన్ ప్లానింగ్ మహేష్ కు భిన్నంగా ఉంది.సర్దార్ గబ్బర్ సింగ్ సేఫ్ ప్రాజెక్ట్ లా కనిపిస్తోంది.

గబ్బర్ సింగ్ బ్రాండ్ కావడంతో ఏమాత్రం టాక్ వచ్చినా, రికార్డుల జాతరే.కాని ఆ తరువాతే అగ్ని పరీక్ష మొదలవుతుంది.

ఎస్ జే సూర్య,సంతోష్ శ్రీనివాస్,కిషోర్ కుమార్ పార్దాసాని, జాని మాస్టర్… వీళ్ళు పవన్ తరువాతి సినిమాల దర్శకులు.పవన్ దర్శకులని తక్కువ చేయడం కాదు కాని, మహేష్ లైనప్ తో పోల్చుకుంటే పవన్ లైనప్ చాలా వీక్.మరి నిజంగానే నెం.1 వార్ వన్ సైడ్ అయిపోతుందా ?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube