మహేష్ కి పెద్ద సవాల్

కొన్నేళ్ళుగా రికార్డులు అనే పదం వినగానే రెండు పేర్లు ఠక్కున గుర్తొస్తున్నాయి మనకు.అదే మరి మన పవర్ స్టార్, సుపర్ స్టార్ యొక్క ఛరిష్మా.

 Will Mahesh Break Opening Records In Telugu States-TeluguStop.com

ఈ ఇద్దరు, ఎప్పటికప్పుడు ఒకరి రికార్డులను ఒకరు బద్దలు కొట్టుకుంటూ వస్తున్నారు.ఇక తాజాగా మాట్లాడుకుంటే, మహేష్ శ్రీమంతుడుతో నెలకొల్పిన ఓపెనింగ్ రికార్డులను సర్దార్ గబ్బర్ సింగ్ తో బద్దలు కొట్టేసాడు పవన్ కళ్యాణ్.

మరి ఈ నెల 20న విడుదల అవబోతున్న బ్రహ్మోత్సవంతో మహేష్ లెక్క సరిచేస్తాడా? ఓపెనింగ్ రికార్డులను తిరిగి తన జేబులో వేసుకుంటాడా? ఫ్యామిలి సినిమాతో రికార్డు ఓపెనింగ్స్ సాధ్యపడతాయా?

తెలుగు రాష్ట్రాల వరకు కష్టమే అనిపిస్తోంది కాని వరల్డ్ వైడ్ గా, సర్దార్ మొదటిరోజు కలెక్షన్లు దాటే అవకాశం బ్రహ్మోత్సవం కి పుష్కలంగా ఉన్నాయి.

తెలంగాణలో మహేష్ మళ్ళీ తనని తానే దాటుకోవాలి.

ఎందుకంటే శ్రీమంతుడు నైజాం మొదటిరోజుని సర్దార్ దాటలేదు.ఇక తెలుగు రాష్ట్రాల్లో మహేష్ సినిమాకి మొదటిరోజు రికార్డు స్థాయిలో ఉండబోతోందా లేదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులే డిసైడ్ చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube