ఆ డైరెక్టర్‌కు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..?  

Will Mahesh Babu Say Yes To Anil Ravipudi Once Again, Mahesh Babu, Anil Ravipudi, F3, Sarileru Neekevvaru, Tollywood News - Telugu Anil Ravipudi, F3, Mahesh Babu, Sarileru Neekevvaru, Tollywood News

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపారు.

TeluguStop.com - Will Mahesh Babu Say Yes To Anil Ravipudi Once Again

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో దర్శకుడు అనిల్ రావిపూడితో మరో సినిమా చేసేందుకు తాను రెడీ అన్నాడు మహేష్.అయితే ఇప్పుడు మాత్రం అనిల్ రావిపూడికి మహేష్ మరో ఛాన్స్ ఇస్తాడా అనేది సందేహంగా మారింది.
ప్రస్తుతం అనిల్ రావిపూడి తనకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందించిన ఎఫ్2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్3 చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే సరికి ఇంకా సమయం పడుతుండటంతో ఈలోపు అనిల్ రావిపూడి ఓ చిన్న బడ్జెట్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా మహేష్ బాబుతో మరో సినిమా చేసేందుకు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు.అయితే మహేష్ మాత్రం సరిలేరు నీకెవ్వరు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదని భావించి, ఇప్పట్లో అనిల్ రావిపూడితో మరో సినిమా చేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

TeluguStop.com - ఆ డైరెక్టర్‌కు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

గతంలో కూడా మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లితో మహర్షి చిత్రం తరువాత మరో సినిమా చేస్తానని చెప్పి, ఆ తరువాత ఎందుకో ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపలేదు.ఇప్పుడు అనిల్ రావిపూడితో కూడా మహేష్ ఓ సినిమా చేస్తానని చెప్పి, ఇప్పుడు చేసే ఆలోచనలో లేడని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక అనిల్ రావిపూడి ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న మహేష్, ఇప్పుడు హ్యాండ్ ఇస్తుండటంతో, ఈ డైరెక్టర్ ఎలా ముందుకెళ్తాడనేది ఆసక్తికరంగా మారింది.కాగా ఎఫ్3 చిత్రంలోనూ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

మరి అనిల్ రావిపూడి ఈ సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

#Mahesh Babu #Anil Ravipudi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Will Mahesh Babu Say Yes To Anil Ravipudi Once Again Related Telugu News,Photos/Pics,Images..