కీలక సమరానికి సిద్ధమైన కోహ్లీ.. ఈసారైనా సెంచరీ సాధిస్తాడా..?

దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా, సౌతాఫ్రికా మూడు టెస్టుల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే రెండు టెస్టులు పూర్తి అవగా, అవి రెండూ డ్రాగా ముగిశాయి.

 Will Kohli Who Is Ready For A Crucial Fight, Score A Century Soon Virat Kohli, L-TeluguStop.com

దీంతో మూడవ టెస్ట్ మ్యాచ్ కీలకంగా మారనుంది.ఈ టెస్ట్ మ్యాచ్ కేప్ టౌన్ వేదికగా జనవరి 11 నుంచి 15వ తేదీల మధ్య కొనసాగనుంది.

ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా అని ఫ్యాన్స్ కలవరపడుతున్నారు.ఎందుకంటే కోహ్లీ వెన్నునొప్పితో రెండో టెస్టు కు దూరమయ్యాడు.

అయితే తాజాగా కోహ్లీ కీలక సమరానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.నిర్ణయాత్మక మూడవ మ్యాచ్‌కు ముందుగా అతడు కఠోర శిక్షణ తీసుకుంటున్నాడని బీసీసీఐ చేసిన ట్వీట్ ద్వారా తెలుస్తోంది.

ఆదివారంనాడు కోహ్లీ ప్రాక్టీస్ సెషన్ లో పాటిస్పేట్ చేసి కవర్ డ్రైవ్, ఆఫ్ డ్రైవ్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించాడు.

ద్రావిడ్ సలహాలతో పాటు తన ప్రతిభ, పట్టుదలతో ఈసారి కోహ్లీ బ్యాటింగ్ లో రాణిస్తాడని అందరూ అనుకున్నారు.

అయితే మొదటి టెస్టులో 46 పరుగులు చేసి కోహ్లీ ఔట్ అయ్యాడు.వెన్నెముక గాయం కారణంగా రెండో టెస్ట్ లో ఆడ లేదు.ఇక మూడో టెస్టులో అతను తన సత్తా చూపించాల్సి ఉంది.కోహ్లీ పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించినట్లయితే హనుమ విహారి స్థానంలో అతన్ని టీం లోకి తీసుకునే అవకాశాలున్నాయి.

మరి ఈ మ్యాచ్‌లోనైనా కోహ్లీ సెంచరీ సాధిస్తాడో లేదో చూడాలి.

రెండో టెస్టులో మహ్మద్ సిరాజ్ గాయం కారణంగా తప్పుకోవడంతో ఇషాంత్ శర్మ మూడో టెస్టులో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఉమేష్ యాదవ్ పేరు కూడా వినిపిస్తుంది కానీ అతనిని తీసుకునే అవకాశాలు తక్కువ అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.అలాగే ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారడానికి ఇంకొక కారణం ఉంది.

అదేంటంటే, సౌతాఫ్రికాలో 1992 నుంచి 2022 వరకు మొత్తం 22 మ్యాచ్‌లు జరిగితే అందులో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రామే ఇండియా గెలిచింది.ఇందులో 11 సౌత్ ఆఫ్రికా గెలిస్తే 7 డ్రాగా ముగిశాయి.

అయితే సౌతాఫ్రికా గడ్డపై మాత్రమే కాకుండా మిగతా ప్రదేశాల్లో జరిగిన మొత్తం టెస్టుల్లో టీమ్ ఇండియా, సౌత్ ఆఫ్రికా 41 సార్లు తలపడ్డాయి.ఇందులో టీమిండియా 15 మ్యాచ్ లు గెలిస్తే సౌతాఫ్రికా 16 మ్యాచ్ లు గెలిచింది.

మిగిలిన పది మ్యాచ్లు డ్రా అయ్యాయి.అయితే సౌత్ ఆఫ్రికా గడ్డపై గెలవడం ఇండియా కి అందని ద్రాక్షగా మారుతోంది.

ఈసారైనా గెలవాలని కోహ్లీసేన ఆరాటపడుతోంది.మరి గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియాలంటే నాలుగు రోజులు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube