కోహ్లీ ఆర్సీబీలో నాకు చోటిస్తావా..? అడుగుతున్న ఆ దేశ ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్‌..!  

విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాకుండా, అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా అతనిని అభిమానించే వారు ఎందరో.

TeluguStop.com - Will Kohli Hit Me In The Rcb The Captain Of That Countrys Football Team Is Asking

అంతలా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా తన క్రేజ్ ను పెంచుకున్నాడు.ఇకపోతే తాజాగా ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఫుట్ బాల్ టీం కెప్టెన్, ప్రీమియ‌ర్ లీగ్ క్ల‌బ్ టోటెన్‌హామ్ హాట్‌స్ప‌ర్ ప్లేయ‌ర్ అయిన హ్యారీ కేన్‌ విరాట్ కోహ్లీ ఓ రిక్వెస్ట్ పంపించాడు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

TeluguStop.com - కోహ్లీ ఆర్సీబీలో నాకు చోటిస్తావా.. అడుగుతున్న ఆ దేశ ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్‌..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఐపీఎల్ లో భాగమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీకి తనకి ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఆడేందుకు చోటిస్తావా అంటూ ట్వీట్ ద్వారా అడిగాడు.

ఈ టోటెన్‌హామ్ హాట్‌స్ప‌ర్ ప్లేయ‌ర్ తాజాగా టెన్నిస్ బాల్ తో బ్యాటింగ్ చేస్తున్న వీడియోను ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి విరాట్ కోహ్లీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో స్థానం కావాలంటూ రిక్వెస్ట్ చేసాడు.ఇందులో భాగంగా తనలో టి20 విన్నింగ్ బ్యాట్స్మెన్ దాగివున్నాడని చెప్పుకొచ్చాడు.

దీంతో తాను వచ్చే ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీంలో చోటు కల్పిస్తావా అంటూ ట్వీట్ చేశాడు ఈ ఫుట్ బాల్ ప్లేయర్.

ఇకపోతే ఇందుకు సమాధానంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా సరదాగా రిప్లై ఇచ్చాడు.నువ్వు చాలా బాగా ఆడుతున్నావ్.నా జట్టులో కౌంటర్ అటాకింగ్ బ్యాట్స్మెన్ గా చోటు ఇద్దాం అనుకుంటున్నా అంటూ కోహ్లీ రీ ట్వీట్ చేస్తూ సమాధానమిచ్చాడు.

ఇది వరకు కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం మేనేజ్మెంట్ కూడా కేన్ ట్వీట్ పై స్పందిస్తూ.నీ కోసం నెంబర్ 10 జెర్సీని రిజర్వ్ చేసి పెడతామని తెలిపింది.

#Viral Videos #Team #Virat Konil #Batting #Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు