కేసీఆర్ కు సొంత పార్టీ సర్పంచ్ లు ఝలక్ ఇవ్వనున్నారా?

తెలంగాణ రాజకీయ వాతావరణం చాలా చిత్రవిచిత్రంగా హాట్ టాపిక్ గా ఉన్న పరిస్థితి ఉంది.ఒకరిపై ఒకరి ఆధిపత్యం కోసం బీజేపీ, కాంగ్రెస్ తలపడుతున్న పరిస్థితి ఉంది.

 Will Kcr Have Its Own Party Sarpanches Kcr, Trs Party, Sarpanch , Kcr, Own Party-TeluguStop.com

అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఏకగ్రీవ గ్రామాలకు పది లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తామని తెలిపిన సందర్భం ఉంది.అయితే ఈ హామీని ప్రభుత్వం విస్మరించింది అన్న విమర్శ ఉంది.

అయితే కొంత మంది ఏకగ్రీవం సర్పంచ్ లు అప్పులు చేసి మరి తమ తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచ్ లు ఉన్నారు.ఇక అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టినా సమయానికి నిధులు మంజూరు కాకపోవడంతో కొంత మంది పగలు సర్పంచ్ లా, రాత్రి సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తూ తమ తమ కుటుంబాలను వెళ్ళదీస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ఇప్పుడు పరిస్థితి ఏకగ్రీవ నియోజకవర్గాలు దాటి పోటీ చేసి గెలుపొందిన ఇతర సర్పంచ్ లు కూడా నిధులు విడుదల కాక ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్న పరిస్థితి ఉంది.

అయితే తాజాగా అసెంబ్లీలో కెసీఆర్ ఏకగ్రీవ సర్పంచ్ లకు నిధులపై హామీ ఇవ్వలేదని చెప్పడంతో ఒక్కసారిగా ఏకగ్రీవ సర్పంచ్ లు ఆందోళనకు గురైన పరిస్థితి ఉంది.

అయితే స్థానిక పరిస్థితులను అన్నింటినీ ఆలోచించి అందరూ ఒక్కటై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలుస్తోంది.అయితే స్వంత పార్టీ సర్పంచ్ లమైన మాకే ఈ పరిస్థితి ఉందంటే మిగతా సర్పంచ్ ల పరిస్థితి ఎలా ఉంటుందని సర్పంచ్ లు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది.

మేము చాలా వరకు వ్యయ ప్రయాసలకోర్చి ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మా పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని సర్పంచ్ లు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube