హుజురాబాద్ విజయంతో కేసీఆర్ ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వనున్నాడా?

తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజకీయంగా ఎంతగా ప్రకంపనలు సృష్టిస్తుందో మనం చూస్తున్నాం.అయితే టీఆర్ఎస్ కు ఉన్న బలమైన నియోజకవర్గాలలో హుజూరాబాద్ ఒకటి.

 Will Kcr Counter The Opposition With The Huzurabad Victory-TeluguStop.com

ఒక్కమాటలో చెప్పాలంటే హుజూరాబాద్ నియోజకవర్గం అనేది టీఆర్ఎస్ కంచుకోట.అయితే ఈటెల టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన తరువాత మొదట్లో ఈటెలకు పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తమవడంతో టీఆర్ఎస్ కూడా అలర్ట్ అయిందని చెప్పవచ్చు.

సునాయాసంగా గెలుస్తామనుకున్న టీఆర్ఎస్ కు కొన్ని ఎదురు దెబ్బలు తగలడంతో ఇక కొంత వెనక్కి తగ్గి నియోజకవర్గ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది టీఆర్ఎస్.హుజూరాబాద్ లో ఎక్కువగా దళిత ఓటర్లు ఉన్న పరిస్థితులలో దళిత బంధు పధకాన్ని ప్రకటించిన టీఆర్ఎస్ ఇక హుజూరాబాద్ లో విజయానికి దళిత బంధు మీదే ఆశలు పెట్టుకుంది.

 Will Kcr Counter The Opposition With The Huzurabad Victory-హుజురాబాద్ విజయంతో కేసీఆర్ ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వనున్నాడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

  అయితే ఇప్పటివరకు ప్రతిపక్షాలు హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓటమికి శాయశక్తులా ప్రయత్నిస్తున్న తరుణంలో టీఆర్ఎస్ గెలిచి ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తూ ఇక ఈ విజయాన్ని రాష్ట్ర వ్యాప్త విజయంగా టీఆర్ఎస్ చిత్రీకరించే ప్రయత్నం చేయనుంది.దీంతో ప్రతిపక్షాలు కొంత వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి వస్తుంది.

ఏది ఏమైనా ఒక అవరోధాన్ని అవకాశంగా ఎలా మార్చుకోవాలో కెసీఆర్ కు తెలిసినంతగా ఎవరికి తెలియదు అనేది సుస్పష్టం.

#@BJP4Telangana #Bandi Sanjay #YS Sharmila #Telangana #Revanth Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు