హుజూరాబాద్ సభతో కెసీఆర్ వాటన్నింటికి చెక్ పెట్టనున్నాడా?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి ఉంది.

 Will Kcr Check All Of Them With Huzurabad Meeting, Telangana Politics, Kcr Huzur-TeluguStop.com

అయితే ఈ ఉప ఎన్నికలో విజయం సాధించిన పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు మరింత బలపడే అవకాశం ఉంటుంది.అంతేకాక కెసీఆర్ హామీలను అమలుపరచకపోవడంతో ఆగ్రహంతో ఉన్న వారు ఇతర పార్టీలకు మద్దతు పలుకుతున్నారు తప్ప కెసీఆర్ పాలన పట్ల అసంతృప్తిగా లేరన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించడం బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు ఎంత ముఖ్యమో టీఆర్ఎస్ పార్టీకి అంతకన్నా ఎక్కువ ముఖ్యం.ఎందుకంటే హుజూరాబాద్ నియోజకవర్గం గత 20 సంవత్సరాలుగా టీఆర్ఎస్ కంచుకోట.

ఇక టీఆర్ఎస్ కంచుకోటలకు బీటలు వారితే ఇక ఇదే ఎఫెక్ట్ మిగతా నియోజకవర్గాలపై కూడా ఉండే అవకాశం ఉంది.అయితే ఇక పోలింగ్ కి గడువు దగ్గర పడుతున్న దశలో పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలను పన్నడంలో నిమగ్నమయిన పరిస్థితి ఉంది.

త్వరలో హుజూరాబాద్ లో కెసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే.ఈ సభపైనే  టీఆర్ఎస్ నేతలు ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది.

Telugu @cm_kcr, Huzurabad, Cm Kcr, Congress, Gellusrinivas, Kcr Huzurabad, Telan

ఈ సభ ద్వారా ప్రజలు టీఆర్ఎస్ పార్టీవైపు మొగ్గు చూపితే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిచే అవకాశం  ఉంటుంది.లేకుంటే  టీఆర్ఎస్ ఓటమి తప్పదు.అయితే ఈ సభలో ఈటెల రాజేందర్ చేస్తున్న దళిత బంధు విమర్శలు, ఇంకా తనపై చేస్తున్న విమర్శలపై కెసీఆర్ ఘాటుగా స్పందించే అవకాశం ఉంటుంది.లేకుంటే ప్రతిపక్షాల విమర్శల గురించి కెసీఆర్ ప్రసంగంలో ప్రస్తావన రాకుంటే కెసీఆర్ బహిరంగ సభతో టీఆర్ఎస్ కు ఎటువంటి ప్రయోజనం ఉండదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube