కాశ్మీర్@30 కాంగ్రెస్ పార్టీకి కలసి వచ్చేనా..?

రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జోడో యాత్ర.ఇప్పుడు కాశ్మీర్లో అడుగు పెట్టింది.

 Will Kashmir@30 Success The Congress Party..? Kashmir Politics,congress Party, N-TeluguStop.com

కశ్మీర్లోని దాదాపు సగం జిల్లాలను కవర్ చూస్తూ ఈ యాత్రను కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు.అలాగే కశ్మీర్ కేంద్రంగానే దేశ రాజకీయాలు ప్లాన్ చేయాలని సైతం ఫిక్స్ అయ్యారు.

రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర ఈనెల 30న ముగుస్తూ ఉండటంతో.భారీ బహిరంగ సభకు నేతలు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సభలో దేశంలోని బావ సారూప్యత కలిగిన పార్టీలన్నిటీనీ ఆహ్వానించాలని సైతం నిర్ణయించారు.

Telugu Congress, Jodo Yatra, Kashmir-Politics

కాంగ్రస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటికే దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలన నేతలకు లేఖలు రాశారు.దాదాపు 26 పై చిలుకు పార్టీల నేతలు రాహుల్ సభకు హాజరయ్యే చాన్స్ ఉంది.ఒక్క కశ్మీర్లోనే పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీతో పాటు, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాను హాజరు కానున్నారు.

ఇక దేశ వ్యాప్తంగా. బీజేపీకి వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న నేతలు హాజరుకానున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీల నేతలు మాత్రమే హాజరు అయ్యే చాన్స్ ఉంది.Telugu Congress, Jodo Yatra, Kashmir-Politics

ఈ సభలో స్టేజ్ పైన కూర్చునే పార్టీల నేతలతోనే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది.కాశ్మీర్ వేదికగానే ఆ పార్టీలు అన్ని.బీజేపీపై యుద్ధం ప్రకటించే చాన్స్ ఉంది.

కాంగ్రెస్ భావిస్తున్నట్టు భావ సారూప్యత కలిగిన నేతలంతా ఒక్కతాటిపైకి వస్తే. కాశ్మీర్@30 సక్సెస్ అయినట్టే అని విశ్లేషకులు చెబుతున్నారు.

కశ్మీర్ లో ఏర్పటు చేసిన ర్యాలీ, బహిరంగ సభలు భారీ సక్సెస్ అయితే.దాని ఎఫెక్ట్ దేశ వ్యాప్తంగా ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీ ప్లాన్.

ఇది సక్సెస్ కావాలంటే.నేతలంతా ఒక్కతాటిపైకి రావాలి.

ఒకవేళ సభకు భారీ ఎత్తున పార్టీల నేతలంతా వచ్చినా.వారు ఎన్నికల రోజు వరకూ ఉంటారన్నది అనేమానమే.

అలాకాకుండా చివరి వరకూ వారంతా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటే మాత్రం కశ్మీర్ మంతనాలు ఫలించినట్టే అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube