ద‌స‌రా.. నాటికి మంత్ర‌వుతానేమో ?

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పడబోతున్నాయంటూ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావు చేస్తున్న వ‌రుస చ‌ర్చ‌లు, త‌మ పంట పండిస్తాయ‌ని, మంత్రుల‌య్యే ఛాన్స్ క‌ల్పిస్తాయ‌ని అశావాహ ఎమ్మెల్ల్యేలు చంక‌లెగ‌రేస్తున్నారు.

 Will Jumped Tdp Mla Get Minister Post In Kcr Cabinet..?-TeluguStop.com

ఇటీవ‌ల కారెక్కేసిని న‌గ‌రానికి చెందిన ఓ తెలుగుదేశం శాస‌న‌స‌భ్యుడు ద‌స‌రా నాటికి జిల్లాలు వ‌స్తే, త‌ను మంత్ర‌యినా ఆశ్చ‌ర్య‌పోన‌ఖ్ఖ‌ర్లేదంటూ స‌న్నిహితుల‌తో చెప్ప‌డమే ఈ చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

ప్రస్తుతం ఉన్న పది జిల్లాలకు తోడుగా కొత్తగా మరో 14 లేదా 15 జిల్లాలను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే, దీంతో అటు ఇటుగా తెలంగాణ కొత్త జిల్లా సంఖ్య 24కు చేరే అవకాశం ఉందన్న వాద‌నా విన‌వ‌స్తోంది.

ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో మొత్తం 17 మంది మంత్రులుగా వ్యవహరిస్తుండ‌గా, జిల్లాకు క‌నీసం ఒక మంత్రి అయినా ఉండేలా చూస్తానంటూ ముఖ్య‌మంత్రి సన్నిహితుల ముందు చెప్ప‌డంతో ద‌స‌రా నాటికి కొత్త జిల్లాల ఆవిష్క‌ర‌ణ త‌దుప‌రి త‌మ‌కు మంత్ర‌య్యే అవ‌కాశం వ‌స్తుంద‌ని, ఇప్ప‌టి నుంచి అధికార ద‌ర్పాల‌ను కొంద‌రు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌న్న గుస‌గుస‌లూ విన‌వ‌స్తున్నాయి.కాగా ద‌స‌రా నాటికే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు శ్రీ‌కారం చుట్టినా, ఆశ్చ‌ర్య‌పోన‌ఖ్ఖ‌ర్లేద‌న్న‌ది మ‌రి కొంద‌రి మాట‌.

ఇక ఇప్ప‌టికే కొత్త జిల్లాలకు స‌రిప‌డా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను చేకూర్చుకున్నందున జిల్లాల‌ల‌కు సంబంధించి వివిధ క‌మిటీలు ఏర్పాటు ఖాయ‌మ‌ని, ఆయా ప‌ద‌వులు పొందేందుకు స్ధానిక నేత‌లు ఇప్ప‌టి నుంచే సీనియ‌ర్ల ఆశీస్సుల‌కోసం తిరుగుతున్న‌ట్లు తెరాస పార్టీ శ్రేణుల నుంచి విన‌వ‌స్తోంది.

ఏది ఏమైనా ద‌స‌రా నాటికి తెరాస‌లో నేత‌ల కొత్త‌ప‌ద‌వులంటం ఖాయ‌మ‌న్న‌ది విశ్లేష‌కుల భావ‌న‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube