జగన్ విదేశీ పర్యటన ఏపీకి మేలు చేసేనా?

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాల్సిన పరిస్థితి నెలకొంది.అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పుకోదగ్గ రీతిలో పరిశ్రమలు రాష్ట్రానికి తరలివచ్చిన దాఖలాలు అయితే లేవు.

 Will Jagan's Foreign Tour Benefit Ap, Andhra Pradesh, Jagan Mohan Reddy, Davos-TeluguStop.com

ఈ నేపథ్యంలో జగన్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు.గత మూడేళ్లుగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కే పరిమితం అయిన ఆయన ఎట్టకేలకు దావోస్ వెళ్తున్నారు.

ఈనెల 22 నుంచి 26 వరకు సీఎం జగన్‌తో పాటు ఏపీ బృందం దావోస్‌లో పర్యటించనుంది.

స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో ఏపీ ప్రభుత్వం తరఫున హాజరయ్యే బృందానికి జగన్ నేతృత్వం వహించనున్నారు.

జగన్ వెంట దావోస్ వెళ్లేవారిలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుడివాడ అమర్నాథ్, ఎంపీ మిథున్ రెడ్డి, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.గతంలో టీడీపీ హయాంలో దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకానమిక్ సదస్సులకు తరచుగా చంద్రబాబు వెళ్లేవారు.

అందుకే దావోస్ అంటే చంద్రబాబు.చంద్రబాబు అంటే దావోస్ అన్న రీతిలో ఉండేది.

అయితే వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత జగన్ దావోస్ వెళ్లడం ఇదే తొలిసారి.మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తుండటంతో రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలన్న ఉత్సాహం ఇన్నాళ్లకు వైసీపీలో కనిపిస్తోంది.

ఏపీకి ఎంతో కొంత పెట్టుబడులు తెచ్చి కొన్ని ప్రాజెక్టులు ప్రారంభిస్తే.ఆ పేరు చెప్పుకుని ఎన్నికల బరిలోకి దిగవచ్చని వైసీపీ భావిస్తున్నట్లు అర్ధమవుతోంది.

ఈ దావోస్‌లో జరిగే సదస్సులో భాగంగా పలు మల్టీనేషనల్ కంపెనీలతో జగన్ సమావేశమై.రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విషయంపై చర్చించనున్నారు.

Telugu Andhra Pradesh, Davos, Mp Mithun Reddy, Ysrcp-Telugu Political News

పీపుల్ ప్రోగ్రెస్ పాజిబులిటీస్ అనే థీమ్‌తో తాము దావోస్ సమావేశానికి వెళ్తున్నట్లు ఇప్పటికే మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.అధికార వికేంద్రీకరణకు సంబంధించిన అంశాన్ని దావోస్ వేదికగా వివరిస్తామన్నారు.ఏపీలో అతి పెద్ద తీరం ఉందని.వనరులు ఉన్నాయని షోకేస్ చేస్తామని చెప్పారు.దావోస్‌లో సుమారు 30 మల్టీ నేషనల్ కంపెనీలతో భేటీ కాబోతున్నట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో జగన్ దావోస్ పర్యటన ఏపీకి మేలు చేస్తుందో లేదో వేచి చూడాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube