ఆ కీల‌క నేత విష‌యంలో జ‌గ‌న్ మాట నిలుపుకుంటారా..?

సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకుంటారా అనే చ‌ర్చ వైసీపీ నేత‌ల‌లో జోరుగా సాగుతోంది.త్వ‌ర‌లో మంత్రి వ‌ర్గాన్ని మారుస్తామ‌ని గ‌తంలో సీఎం ప్ర‌క‌టించారు.

 Will Jagan Keep His Word On That Key Leader, Jagan, Politics,ap News-TeluguStop.com

ఈ ప్ర‌క్రియ 100శాతం జ‌రుగుతుంద‌ని సీఎం స‌న్నిహితుడు మంత్రి బాలినేని ప్ర‌క‌టించారు.వ‌చ్చే డిసెంబ‌ర్ నాటికి మంత్రి వ‌ర్గంలో భారీ మార్పులు ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొంద‌రిని పోటీ నుంచి త‌ప్పించి, వారికి మంత్రి ప‌ద‌వులు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.గ‌తంలో ఆయ‌న ఇచ్చిన హామీ ప‌రిస్థితి ఏంటి? అని చ‌ర్చ‌గా మారింది.గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవ ర్గం మాజీ ఎమ్మెల్యే.మర్రి రాజశేఖర్ కు ఏదో ప‌ద‌వి ఇస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు.కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆ విష‌యాన్ని జ‌గ‌న్ ప‌ట్టించుకోలేద‌ని వైసీపీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు.

సీదిరి అప్పల‌రాజు, చెల్లుబోయిన వేణుల‌ను మ‌ధ్య‌లో మంత్రి వ‌ర్గంలోకి తీసుకున్నారు.

ఆ సమయంలో సీఎం రాజ‌శేఖ‌ర్ కు ఇచ్చిన హామీ ప్ర‌స్తావ‌న‌కు రాలేదు.క‌నీసం ఆయ‌న‌కు ఎమ్మెల్సీ కూడా ఇవ్వ‌లేదు.

అయితే సీఎం ఇచ్చిన హామీ మేర‌కు రాజ‌శేఖ‌ర్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ప‌ద‌వి ఇస్తారా? లేక మాట త‌ప్పుతారా? అని వైసీపీ నేత‌లు అంటున్నారు.అంతేకాకుండా మంళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు.

Telugu Ap Ministers, Ap, Jagan, Balineni, Ysrcp-Telugu Political News

ఇలా సీఎం జ‌గ‌న్ చాలా మందికి మంత్రి ప‌ద‌వులు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.వీరిలో ఎంత మందికి తాను ఇచ్చిన మాట‌ల ప్ర‌కారం ప‌ద‌వులు ఇస్తార‌నే చ‌ర్చ ఆ పార్టీలోనే జ‌రుగుతుంది.లేక త‌నకు న‌చ్చిన నేత‌ల‌కే ప‌ద‌వులు ఇస్తారా? అని తెలియాల్సి ఉంది.సీఎం జ‌గ‌న్ ఇచ్చిన మాట నిల‌బెట్టుకోక‌పోతే నైతికత కోల్పోయిన‌ట్టే అంటున్నారు వైసీపీ నేత‌లు.

కొత్తగా పార్టీలోకి వ‌చ్చిన వారికి అవ‌కాశం ఇస్తున్నార‌ని, పార్టీ కోసం ప‌ని చేసిన వారికి ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌ని ఇదే స‌మంజ‌సం అంటున్నారు.ఏది ఏమైనా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యం ఎలా ఉంటుందో వేచ్చి చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube