కష్టమంతా వారిదేనా ? జగన్ వారిని గుర్తించాడా ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనే భావనలో ఉంది.గత ఎన్నికల్లో దొర్లిన అనేక తప్పులు ఈసారి మళ్ళీ రిపీట్ అవ్వకుండా జగన్ జాగ్రత్తపడ్డాడు.

 Will Jagan Identify Hard Workers In Ycp-TeluguStop.com

గత ఎన్నికాల్లోనే వైసీపీకి దక్కాల్సిన అధికారం తృటిలో తప్పుకుంది అనే భావన అందరిలోనూ ఉంది.మనమే గెలుస్తాం అనే ధీమా జగన్ లో ఎక్కువ అవ్వడం, పోలింగ్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి కారణాలు అధికారం దూరం అవ్వడానికి కారణం అయ్యాయి.

గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఆ పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్త నుంచి అధినేత వరకు అందరికీ గట్టి గుణపాఠమే నేర్పింది.గత ఎన్నికల అనుభవంతో ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా, జాగ్రత్తగా ప్రతి స్టెప్ ఆచి తూచి వేసింది.

నాయకులకంటే ఈ సారి కింది స్థాయి కార్యకర్తల్లోనూ గెలవాలి అనే కసి బాగా కనిపించింది.అందుకే తమ శక్తికి మించి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు.బూత్ కమిటీ సభ్యుడి నుంచి ప్రతీ ఒక్కరూ పార్టీని గెలిపించేందుకు కృషి చేశారు.వైసీపీ అధికారంలోకి వస్తే ఆ క్రెడిట్ అంతా కార్యకర్తలదే అన్నదాంట్లో సందేహమే లేదు.

గత ఎన్నికల ముందు వరకూ వైసీపీ గెలుస్తుందనే అంచనాలు అందరిలోనూ ఉండేవి.ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.

క్షేత్రస్థాయిలో పటిష్ఠమైన కార్యకర్తల బలం లేకపోవడం, ఉన్న చోట్ల కూడా అధినేత ఇమేజ్ తమను గెలిపిస్తుందని కార్యకర్తలు అలసత్వంగా ఉండటం, పోల్ మేనేజ్ మెంట్ ను పూర్తిగా పట్టించుకోకపోవడం వైసీపీ ఓటమికి కొన్ని కారణాలు.కానీ టీడీపీ ఈ అన్ని విషయాల్లో సమర్థవంతంగా పనిచేయడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది.

కానీ టీడీపీ అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లు వైసీపీ కార్యకర్తలు చాలా కష్టాలు, వేధింపులు ఎదుర్కొన్నారు.వారికి టీడీపీ అమలు చేసిన ఏ సంక్షేమ పథకాలు అందలేదు.అధికార పార్టీ కార్యకర్తలు జన్మభూమి కమిటీల్లో చేరి గ్రామాల్లో హవా నడిపించారు.ఇది వైసీపీ కార్యకర్తల్లో కసి బాగా పెంచింది.అందుకే ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో మరింత కష్టపడి పనిచేసారు.గత ఎన్నికల్లో చేసిన తప్పులు ఈసారి జరగకుండా వైసీపీ ముందు నుంచే పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టి పెట్టింది.

బూత్ ల వారీగా ప్రతీ 50 ఇళ్లకు ఒక కార్యకర్తను నియమించారు.వీరంతా వైసీపీకి ఓట్లు వేయించడంలో కీలకంగా మారారు.

ఈ పరిణామాలు అన్నిటిని ఎప్పటికప్పుడు జగన్ నివేదికల రూపంలో తెప్పించుకుని కార్యకర్తల కృషి గురించి అనేక సందర్భాల్లో పార్టీ నాయకుల దగ్గర ప్రస్తావించారట.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube