100 రోజుల్లో ఇమ్మిగ్రేషన్ మార్చేస్తా.. టాలెంట్‌కే ప్రాధాన్యం: జో బైడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించడంలో ప్రధాన భూమిను పోషించిన అంశం ఇమ్మిగ్రేషన్.వలస విధానంలో ట్రంప్ అనుసరించిన కఠిన వైఖరితో విసిగిపోయిన సెటిలర్లు, అమెరికన్ కంపెనీలు బైడెన్‌ వైపే మొగ్గు చూపాయి.

 Will Introduce Immigration Bill immediately After Taking Office: Joe Biden, Us P-TeluguStop.com

అందుకు తగ్గట్టే తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లో ఇమ్మిగ్రేషన్ విధానంలో సమూలంగా మార్పులు తీసుకొస్తానని బైడెన్ హామీ ఇచ్చారు.ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఇచ్చిన మాట నెరవేర్చేందుకు ఆయన సిద్ధమయ్యారు.

దీనిలో భాగంగా ట్రంప్ తెచ్చిన ఇమ్మిగ్రేషన్ చట్టాలు రద్దు చేస్తామని బైడెన్ ప్రకటించారు.

ప్రధానంగా ఐటీ నిపుణులకు అందించే హెచ్‌ 1 బీ వీసాల జారీపై ట్రంప్ విధించిన ఆంక్షలను ఎత్తి వేస్తామని బైడెన్‌ వెల్లడించారు.

ఈ ఏడాది మార్చి 31 వరకు ఉన్న నిషేదాన్ని రద్దు చేయడంతో పాటు, నిబంధనల్లో సవరణలు చేపడతామని చెప్పారు.కొత్త ఇమ్మిగ్రేషన్‌ బిల్లును పరిశీలించేందుకు కమిటీలకు పంపించనున్నారు.

దీంతో పాటు ప్రస్తుతం ఉన్న హెచ్‌ 1 బీ వీసాల లాటరీ విధానానికి స్వస్తి చెప్పి దీని స్థానంలో వేతనాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇస్తామని బైడెన్ వెల్లడించారు.అలాగే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్‌లలో.

పీహెచ్‌డీ చేసిన వారికి గ్రీన్‌కార్డు ఇచ్చేందుకు కూడా ఆయన సుముఖంగా వున్నారు.

Telugu Biden Guarantee, Hb Visa, Policy, Joe Biden, Trumpstough, Presidential, V

అలాగే పర్యావరణం, టీకా పంపిణీపై తమ ప్రభుత్వ విధానాల గురించి బైడెన్ మరోసారి స్పష్టం చేశారు.అధికారం చేపట్టిన మొదటి రోజే పారిస్ వాతావరణ ఒప్పందంలో తిరిగి చేరతామని తెలిపారు.పర్యావరణ అంశాలకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షిస్తామని బైడెన్ వెల్లడించారు.

వంద రోజుల్లో 10 కోట్ల మందికి టీకాలు అందించడమే తన లక్ష్యమన్న ఆయన… కరోనాని ఎదుర్కొనేందుకు తక్షణమే ఆర్థిక సాయం చేయాల్సిందిగా కాంగ్రెస్‌ను కోరతానని బైడెన్ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube