జాతీయస్థాయిలో బిజెపికి( BJP party ) ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష కూటమి ఏర్పాటు చేసిన ఇండియా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది.ప్రతిపక్షాల ఐక్యతపై మొదట్లో ఎవరికీ నమ్మకం లేకపోయినా బెంగళూరు వేదికగా జరిగిన సమావేశంలో నేతల ఐక్యత చూసిన వారికి కొత్త ఆశ లు చిగురుస్తున్నాయనే చెప్పాలి.
నిజానికి కూటమిలో ఉన్న చాలా పార్టీలు ఆయా రాష్ట్రాల్లో వ్యతిరేక పక్షాలుగా పోరాడుతున్నందున ఈ ఐక్యత ఎంతో కాలం నిలబడదని వచ్చే ఎన్నికలలో సీట్ల సర్దుబాటుతో ఇది ఈ కూటమి ముక్కలవుతుందని చాలామంది అంచనా కట్టారు.అయితే బిజెపిని ఎట్టి పరిస్థితుల లోనూ ఓడించాలని దృడ నిశ్చయం తో ఉన్న ప్రతిపక్ష కూటమి తమ ఐక్యతకు అడ్డుగా ఉన్న అన్ని అంశాలను అనధికారికంగాఇప్పటికే పరిష్కరించుకుందని తెలుస్తుంది .

ప్రతిపక్ష కూటమిలో ఉన్న చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ వస్తుంది అందువల్ల ఆయా రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్తో తలపడాల్సిన పరిస్థితుల్లో చాలా పార్టీలు ఉన్నాయి .అయితే ఇప్పుడు కాంగ్రెస్ మధ్యే మార్గంగా ఒక ఫార్ములాను రూపొందించిందని తెలుస్తుంది .ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్ ,ఉత్తర ప్రదేశ్ ,పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూటమిలో ఉన్న పార్టీలతో పోరాడాల్సి ఉన్నందున పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లను 50- 50 ఫార్ములా తో పంచుకుందామని ఇప్పటికే ఒక రాజీ ఫార్ములా ను కాంగ్రెస్( Congress party ) రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది .దీనికి ఆయా పార్టీల అధినేతల సైతం సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

దుందుడుకుతనానికి మారుపేరుగా ఉండే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ( Mamata Banerjee ) కూడా ఈ ఎన్డీఏ కూటమిలో యాక్టివ్ ప్లే చేస్తున్నందున కూటమి ముఖ్య ఉద్దేశం నెరవేరినట్లే కనిపిస్తుంది.ప్రతిపక్ష పార్టీలను అష్టదిగ్బంధనం చేసి మతవాద రాజకీయాలకు ఊతమిస్తున్న బిజెపిని నిలువరించి హ్యాట్రిక్ కొట్టకుండా ఆ పార్టీని ఆపకపోతే రాజకీయ మనుగడ కష్టమని భావిస్తున్న ప్రతిపక్షాలు ఈసారి ఒక అడుగు కిందకి వేసైనా సరే బిజెపిని ఓడించాలని పట్టుదలను ప్రదర్శిస్తున్నాయి.పైకి బింకంగా నిలబడినప్పటికీ భాజపా కూడా ఈ కూటమి పార్టీ ఐక్యత పట్ల కొంత ఆందోళన పరుస్తున్నట్టుగా విశ్లేషణలు వస్తున్నాయి .అందుకే ఈ కూటమి ని ఒక వైపు విమర్శిస్తూ మరోవైపు తమ ఎన్డిఏ కూటమి ని బలపరుచుకునే ప్రయత్నాలకు తెర తీసింది .