బీజేపీలో ఈటెలకు కీలక పదవి లభించబోతుందా?

తెలంగాణ బీజేపీ రథసారథి బండి సంజయ్ సమర్ధవంతంగా పనిచేస్తూ అధిష్టానం పెద్దల మెప్పు పొందుతున్నారు.ఒకరకంగా చెప్పాలంటే బీజేపీ పగ్గాలు బండి సంజయ్‌కు అందిన తర్వాతే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందనేది అక్షర సత్యం.

 Will Eetala Rajender Get A Key Position In The Bjp Details, Tealangana, Bharatiya Janata Party, Eetala Rajender, Bandi Sanjay, Amit Sha, Bjp Lakshman, Etelea Rajender Key Position, Telangan Bjp, Kcr-TeluguStop.com

ఆయన ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేలా వ్యూహాలను రచిస్తూ కేసీఆర్‌కు పక్కలో బళ్లెంలా మారుతున్నారు.కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టినప్పుడల్లా బండి సంజయ్ కూడా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ కౌంటర్లు ఇస్తుంటారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం గోషామహల్ స్థానంతోనే సరిపెట్టుకున్న బీజేపీ అనంతర పరిణామాల కారణంగా అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా మారడం పెద్ద విశేషంగానే చెప్పుకోవచ్చు.ఇదంతా బండి సంజయ్ చొరవ వల్లే జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే.

 Will Eetala Rajender Get A Key Position In The BJP Details, Tealangana, Bharatiya Janata Party, Eetala Rajender, Bandi Sanjay, Amit Sha, Bjp Lakshman, Etelea Rajender Key Position, Telangan Bjp, Kcr-బీజేపీలో ఈటెలకు కీలక పదవి లభించబోతుందా-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లక్ష్మణ్ నుంచి అధ్యక్ష బాధ్యతలు అందుకున్న బండి సంజయ్ పార్టీని పరుగులు పెట్టించారు.పక్కా ఆర్ఎస్ఎస్ భావాజాలాన్ని నింపుకున్న బండి సంజయ్ ఆ లైన్ దాటి ఎన్నడూ బయటకు వెళ్లలేదు.

అయితే ఇటీవల బండి సంజయ్ తన గొయ్యి తానే తవ్వుకున్న చందాన వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలే మాట్లాడుకుంటున్నారు.బండి సంజయ్ దూకుడు కారణంగా పార్టీకి ఎంత మేలు జరుగుతుందో.

మరోవైపు అంత నష్టం కూడా జరుగుతోంది.ఆయన వాగ్దాటితో పలు వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఒంటెత్తు పోకడలతో సీనియర్లను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.దీంతో పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్తున్నారు.

Telugu Amit Sha, Bandi Sanjay, Bjp Lakshman, Eetala Rajender, Etelearajender, Tealangana, Telangan Bjp-Latest News - Telugu

ఇటీవల కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పలువురు బీజేపీ సీనియర్లు బహిరంగంగా సమావేశాలు నిర్వహించి బండి సంజయ్‌ను విమర్శించడం హాట్ టాపిక్‌గా మారింది.టీఆర్ఎస్ నుంచి వచ్చిన తెలంగాణ ఉద్యమకారుడు ఈటెల రాజేందర్‌ను కూడా బండి పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది.దీంతో మనస్తాపం చెందిన ఈటెల పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా ఉంటున్నారు.ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో ఈటెలను అమిత్ షా పిలిపించుకుని మాట్లాడారు.ఈ నేపథ్యంలో ఈటెల సామర్థ్యాన్ని గుర్తించిన అధిష్ఠానం త్వరలో కీలక పదవి ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube