కేసీఆర్ వ్యూహంలో కాంగ్రెస్ రెబల్స్ చిక్కుతారా..?

కేసీఆర్( KCR ) రాజకీయం చేయడంలో అపర చాణిక్యుడు అని చెప్పవచ్చు.సమయస్ఫూర్తితో పాటు, ఫ్యూచర్ లో కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇతర పార్టీ నాయకులను చిక్కుల్లో పడేసే విధంగా వ్యూహాలు రచించడంలో దిట్ట.

 Will Congress Rebels Get Involved In Kcr's Strategy, Congress, Cm Kcr , Ts Polit-TeluguStop.com

ఆయన ఎలాంటి వ్యూహం వేసిన దాని వెనుక ఏదో ఒక రహస్యం ఉండనే ఉంటుంది.అలాంటి కేసీఆర్ ఈసారి రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టాలని అన్ని రకాల ప్లాన్లు రెడీ చేసుకుని పెట్టుకున్నారు.

ఇప్పటికే బీఆర్ఎస్( BRS ) పార్టీ నుంచి 115 మంది అభ్యర్థులను ప్రకటించారు.దీని వెనుక కూడా ఒక ప్రత్యేకమైన వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది.

Telugu Cmkcr, Congress, Congress Rebals, Telangana, Ts-Politics

గులాబీ బాస్ ఎప్పుడైనా సరే తన పార్టీ బలం కంటే ఎక్కువ, ప్రత్యర్థి పార్టీల బలహీనతలపై దృష్టి సారిస్తారు.ఈసారి కూడా అదే వ్యూహంతో పాచికలు వేశారు.అయితే కాంగ్రెస్ పార్టీ( Congress Party ) లో టికెట్ల ప్రకటన తర్వాత విపరీతమైనటువంటి రెబల్స్ ఉంటారు.ఆ పార్టీలో ఉన్నటువంటి రెబల్స్ బిఆర్ఎస్ లోకి ఆహ్వానించే ప్రక్రియ మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఆయా నియోజకవర్గాల వారిగా బంగపడే నేతలను గుర్తించినట్టు సమాచారం.ఒకవేళ కాంగ్రెస్ ( Congress ) లో టికెట్ రాకుంటే, అందులో బంగపడ్డ బలమైన నేతలను బిఆర్ఓస్ లోకి ఆహ్వానించి తన ప్లాన్ ను అమలు చేయనున్నారు.

Telugu Cmkcr, Congress, Congress Rebals, Telangana, Ts-Politics

అంటే ముల్లును ముల్లుతోనే తీయాలని సామెత ప్రకారం కాంగ్రెస్ రెబల్స్ ( Congress rebals ) ను పార్టీలోకి ఆహ్వానించి, కాంగ్రెస్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించి ప్రజల దగ్గర కాంగ్రెస్ పార్టీ బలహీనతలను బయటపెట్టే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.అయితే కేసీఆర్ వేసిన ప్లాన్ ప్రస్తుతం కాంగ్రెస్ కు గుబులు పుట్టిస్తుందట.అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన చాలా ఆలస్యం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube