జానా గెలుపుకు కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా కృషి చేసేనా?

తెలంగాణలో ఒకదాని తరువాత మరొక ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఆ స్థానం ఖాళీ అయింది.

 Will Congress Leaders Work Together To Win Jana, Kcr,ccongress Party, Janareddy-TeluguStop.com

అయితే వరుస ఎన్నికల్లో ఓడిపోయి ఢీలా పడిన కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికలో గెలిచి తన సత్తాను చాటాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.అయితే కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యత నెలకొనే పరిస్థితులు లేకపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్ మరింత పలుచబడింది.

ఒక రేవంత్ రెడ్డి పోరాడితే మాత్రం కాంగ్రెస్ ను ప్రజలు నమ్మలేరు కదా.అయితే అందరూ ఒకటై కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే నియోజకవర్గానికి కలిగే ప్రయోజనాలపై ఒక స్పష్టమైన అవగాహన కల్పిస్తే ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.అయితే నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట.సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి ఈ నియోజకవర్గంలో గెలుపొందుతూ వస్తున్నారు.అయితే ఈ సారి జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ హవా మరోసారి విజ్రుంభించడంతో జానారెడ్డి ఓడిపోయారు.అయితే ఇప్పుడు తమకు కంచుకోటగా మారిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అందరూ ఒకటై జానా గెలుపుకు కృషి చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube