టీఆర్ఎస్ నేతల భూ కబ్జా ఆరోపణలపై కాంగ్రెస్ పోరాటం కొనసాగేనా?

తెలంగాణ కాంగ్రెస్ మరల పోరాట పటిమ నింపుకొని ప్రజా సమస్యలపై బరిలోకి దిగుతోంది.ప్రస్తుతం దేవరయాంజల్ భూముల కొనుగోలు వ్యవహారంపై ఐఏఎస్ అధికారులతో కలిసి ప్రాథమిక విచారణ కొనసాగించిన విషయం తెలిసిందే.

 Will Congress Continue To Fight Trs Leaders Over Land Grab Allegations Uttam Kum-TeluguStop.com

అయితే ఈ విషయంలో ప్రభుత్వం వ్యూహం ఫలించలేదు.ఈ విషయంపై హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.

రాష్ట్రంలో కరోనాతో ఇంత మంది మరణిస్తుంటే, కేసులు భారీగా నమోదవుతుంటే, దీనికి ప్రాధాన్యత ఇవ్వకుండా భూముల విచారణ ఇప్పుడు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం అవసరమా అని హైకర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.అయితే దేవరయాంజల్ భూముల వ్యవహారంతో మిగతా టీఆర్ఎస్ నేతల భూముల కబ్జాలకు సంబంధించి కూడా అచ్చంపేట భూముల తరహాలో విచారణ జరిపించాలని, మంత్రి మల్లారెడ్డి శిఖం భూములను కబ్జా చేసాడని, ఆ శిఖం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ వ్యాఖ్యానించారు.

ఈ భూముల కబ్జాలపై విచారణ చేసి దోషులను శిక్షించే వరకు వదిలి పెట్టేది లేదని ఉత్తమ్ ఘాటుగా హెచ్చరిస్తున్నారు.ఇక ఇప్పటికే రేవంత్ రెడ్డి మల్లారెడ్డి భూముల కబ్జాలకు పాల్పడటం లేదని నిరూపిస్తారా అంటూ బహిరంగ సవాల్ విసిరారు.

అయితే రేవంత్ సవాల్ కు ప్రతి సవాల్ గా దమ్ముంటే రేవంత్ తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని అన్నారు.మరి ఈ వ్యవహారం ఇంకా ఎంతవరకు వెళ్తుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube