నాయకుడు లేని నావలానే కాంగ్రెస్ కొనసాగనుందా?

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రోజురోజుకు బలహీనంగా తయారవుతోంది.టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ బలహీనతలను ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ లోని యువ నాయకత్వాన్ని, అసంతృప్తులందరినీ బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు.

 Will Congress Continue Like A Novel Without A Leader, Telangana Congress, Uttam-TeluguStop.com

అయితే అసంతృప్తులను బుజ్జగించే సరైన పటిష్ట నాయకత్వం లేకపోవడంతో కాంగ్రెస్ పరిస్థితి నాయకుడు లేని నావలా తయారైందని చెప్పవచ్చు.కాంగ్రెస్ కార్యకర్తలను దిశానిర్దేశం చేసే నాయకుడు లేకపోవడంతో పార్టీ భవిష్యత్తుపై భరోసా ఇచ్చే నాయకత్వం లేకపోవడంతో కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది.

కూటముల కుమ్ములాటలతో గందరగోళంగా ఉన్న తరుణంలో అన్ని పక్కకు బెట్టి పార్టీకొరకు అందరూ కలిసికట్టుగా పోరాడితే కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా వచ్చి ఇంకాస్త ఉత్తేజంగా ప్రభుత్వంపై పోరాడే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఉన్న అవకాశవాద రాజకీయాలలో పార్టీ సిద్దాంతాన్ని నమ్ముకొని పార్టీని అంటిపెట్టుకొని ఉండేవాళ్లు చాలా తక్కువ.

ఇక టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని ప్రజలు భావిస్తే ఏ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీలోకి జంప్ జిలానీలు పెరిగే అవకాశం ఉంది,ఇప్పటికీ కాంగ్రెస్ పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సమస్యలపై పోరాడితే టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోవచ్చు.లేకపోతే కాంగ్రెస్ కు కష్టాలు తప్పవు.

ఒక్కసారిగా సన్నగిల్లిన నమ్మకాన్ని తిరిగి ప్రజలకు కలిగించడం అన్నది చాలా కష్టతరమైన విషయం అనేది కాంగ్రెస్ నాయకులు గ్రహించాలి.చూద్దాం ఇంకా ఎన్నేళ్లు ఇటువంటి పరిస్థితి కొనసాగుతుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube